AP Crime: సోషల్ మీడియా ప్రేమ కథ.. చివరికి ఏమైందంటే..?

విశాఖపట్నానికి చెందిన పద్మ అనే వివాహితకు, శ్రీకాళహస్తికి చెందిన సురేశ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం ప్రేమగా మారింది. సురేశ్‌ని పెళ్లి చేసుకొని నివసించసాగింది. కొన్ని రోజుల తర్వాత చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి రెండు ప్రాణాల్ని తీసుకుంది.

New Update
srikalahasti crime news

srikalahasti crime news

Ap Crime: శ్రీకాళహస్తిలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.  కుటుంబంతో సంతోషంగా ఉండాల్సిన ఓ మహిళ తన ప్రియుడిని ఆశ్రయించడమే కాకుండా భర్తను, పిల్లలను విడిచిపెట్టి మరో జీవితం ప్రారంభించింది. చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. విశాఖపట్నానికి చెందిన పద్మ అనే వివాహితకు, శ్రీకాళహస్తికి చెందిన సురేశ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. మొదట సామాన్యంగా సాగిన ఈ పరిచయం కొద్దికొద్దిగా ప్రేమగా మారింది. పద్మకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆమె సురేశ్‌నే జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం తరువాత పద్మ తన భర్తను, పిల్లలను విడిచిపెట్టి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో సురేశ్‌తో కలిసి పెళ్లి చేసుకొని నివసించసాగింది.

Also Read :  గర్ల్‌ఫ్రెండ్ ప్రాణం తీసిన చికెన్ ముక్క.. ఎలాగంటే..?

టిఫిన్ వృథా అయిందని ప్రాణాలు తీసుకోవాలా..?

గత 9 నెలలుగా ఇద్దరూ కలిసి జీవించసాగారు. మొదట సాఫీగా సాగిన జీవితం త్వరలోనే అనేక విభేదాలకు దారి తీసింది. తరచూ గొడవలు జరుగుతుండడంతో సంబంధం మరింత దిగజారింది. మూడు రోజుల క్రితం.. ఒక చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. టిఫిన్ వృథా చేసిందన్న కారణంతో సురేశ్ ఆమెపై కోపం వ్యక్తం చేయడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన పద్మ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఇది కూడా చదవండి: బరువు తగ్గడానికి 8 రహస్యాలు..ఆశ్చర్య పరిచే అలవాట్లు

ఈ సంఘటనతో దిగ్భ్రాంతి చెందిన సురేశ్‌ శవాన్ని కిందకు దించి.. ఆత్మహత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను తీసుకున్న విషం విషయం తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. వారు వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స ఫలించలేదు. ఆయన కూడా మరణించడంతో ఈ ప్రేమకథ రెండు ప్రాణాల్ని తీసుకున్న విషాదాంతంగా ముగిసింది. ఇప్పుడు పద్మ పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఒంటరిగా మిగిలిపోయారు. ఈ సంఘటన సోషల్ మీడియా సంబంధాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రేమ పేరుతో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. పిల్లల ముందే ప్రాణాలు కోల్పోయిన తల్లి!

Also Read :  మావోయిస్టు అగ్రనేతల మృతదేహాల తరలింపులో అడ్డంకులు

(AP Crime | ap-crime-news | ap crime latest updates | latest-news | telugu-news)

Advertisment
తాజా కథనాలు