/rtv/media/media_files/2025/05/26/V3YzCZUn7BD2modDmuJz.jpg)
Potests against muhammad yunus interim govt in Bangladesh
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు దిగజారిపోయాయి. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వ్యాపార రంగం నుంచి కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కనీసం అక్కడ జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉండటంతో కరువు లాంటి పరిస్థితి వస్తుందని ప్రముఖ వ్యాపార సంఘ నాయకుడు షౌకత్ అజీజ్ రస్సెల్ హెచ్చరించారు. ఈద్ -ఉల్ -అజాకు ముందు కార్మికులకు బోనస్‌లు, జీతాలు ఎలా చెల్లిస్తామో మాకు తెలియదన్నారు.
Also Read: మధ్యప్రదేశ్‌లో దారుణం.. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం
Potests Against Muhammad Yunus
రెవెన్యూ ఉద్యోగులు కూడా రెండు రోజులుగా పని చేయకపోవడంతో యూనస్ ప్రభుత్వానికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. జాతీయ రెవెన్యూ బోర్డు (NBR) అధికారులు కూడా వరుసగా రెండవ రోజు విధులకు దూరంగా ఉన్నారు. ప్రత్యేక కొత్త ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదివారం దాదాపు అన్ని -ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను సోమవారం నుంచి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
యూనస్ దీనిపై స్పందిస్తూ అవామీ లీగ్ కార్యకలాపాలు నిషేధించబడినప్పటి నుంచి.. పరిస్థితిని అస్థిరపరిచేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు కూడా మరో 6 నెలల సమయాన్ని కోరారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ మధ్యలో ఎన్నికలు జరుతాయని అన్నారు.
Also Read: హైదరాబాద్ తో పాటు ఆ 7 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర
మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ముమమ్మద్ యూనస్‌పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. బంగ్లా అవామీ లీగ్ పార్టీని నిషేధించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. ఉగ్ర సంస్థల సాయంతో బంగ్లాదేశ్‌లో పాలన సాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అలాగే బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ మేరకు ఓ ఆడియోను విడుదల చేశారు.
Also Read: ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ-పాక్ భేటీ.. థాంక్స్ చెప్పిన షెహబాజ్ షరీఫ్
Also Read : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్.. ఎక్కడంటే?
national-news | bangladesh | yunus