Kishtwar Cloudburst: జమ్ము కశ్మీర్‌ CM సంచలన నిర్ణయం.. ‘ఆగస్ట్ 15 వేడుకల్లో ఆ కార్యక్రమాలు రద్దు’

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లాలో గురువారం (ఆగస్టు 14) జరిగిన క్లౌడ్ బరస్ట్ పెను విషాదం నింపింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోగా, 200లకు పైగా గల్లంతయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌ CM ఒమర్‌ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.

New Update
omar abdullah

omar abdullah

జమ్మూకశ్మీర్‌(Jammu & Kashmir) లోని కిష్త్‌వార్ జిల్లాలో గురువారం (ఆగస్టు 14) జరిగిన క్లౌడ్ బరస్ట్(Cloud Burst) పెను విషాదం నింపింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోగా, 200లకు పైగా గల్లంతయ్యారు. హఠాత్తుగా వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు కళ్లుమూసి తెరిచేలోగా సర్వం కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి అధికారిక మృతుల సంఖ్య ఇంకా వెలువడలేదు, కానీ సహాయక సిబ్బంది అంచనాల ప్రకారం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read :  గూగుల్ క్రోమ్ కొనేందుకు పిచాయ్‌కి భారీ ఆఫర్ ఇచ్చిన అరవింద్ శ్రీనివాస్.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సీఎం సంచలన నిర్ణయం

కిశ్త్‌వాడ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల చోటుచేసుకున్న విషాదంతో జమ్మూకశ్మీర్‌ CM ఒమర్‌ అబ్దుల్లా(CM Omar Abdullah) కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ‘ఎట్‌ హోం’ టీ పార్టీని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన X వేదికగా పోస్టు పెట్టారు.  ప్రసంగం, మార్చ్‌ ఫాస్ట్‌ వంటి అధికారిక కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయని తెలిపారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరిగే మార్చ్‌ఫాస్ట్‌లో ఒమర్‌ అబ్దుల్లా గౌరవ వందనం స్వీకరించనున్నారు.

కిష్త్‌వార్‌లోని ఛాసోటీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ ప్రాంతం ప్రముఖ మాతా చండీ ఆలయానికి వెళ్లే మచైల్ మాతా యాత్ర మార్గంలో ఉంది. యాత్ర కోసం వచ్చిన భక్తులు, స్థానికులు ఈ విపత్తులో చిక్కుకున్నారు. హఠాత్తుగా వచ్చిన వరద ప్రవాహం పలు గుడారాలను, తాత్కాలిక షెల్టర్లను, లంగర్ (కమ్యూనిటీ కిచెన్)లను పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో మృతులు, గల్లంతైనవారిలో యాత్రికులు, స్థానికులు, అలాగే మచైల్ మాతా యాత్ర భద్రత కోసం ఉన్న భద్రతా దళాల సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం.

Also Read :  ఆపరేషన్ సింధూర్‌లో పని చేసిన 16మంది BSF జవాన్లకు అవార్డులు

కొనసాగుతున్న సహాయక చర్యలు

విపత్తు సమాచారం అందిన వెంటనే, NDRF, SDRF, స్థానిక పోలీసులు, సైన్యం సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యల కోసం అవసరమైతే హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ఘటనతో మచైల్ మాతా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విపత్తులో మరణించినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Viral Video | latest-telugu-news | Jammu Kashmir | Jammu and Kashmir Chief Minister Omar Abdullah | Kishtwar cloudburst | telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు