Aravind Srinivas: గూగుల్ క్రోమ్ కొనేందుకు పిచాయ్‌కి భారీ ఆఫర్ ఇచ్చిన అరవింద్ శ్రీనివాస్.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పెర్ప్లెక్సిటీ AI కంపెనీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ క్రోమ్ బౌజర్ విక్రయించమని రాసిన ఓ లేఖ సంచలనం రేపుతోంది. 34.5 బిలియన్లకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు విక్రయించని సుందర్‌కు ఆఫర్ చేశారు. ఇతని బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

New Update
Aravind Srinivas

Aravind Srinivas

ఈ ప్రపంచంలో అధికంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారు. ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తారు. అయితే పెర్ప్లెక్సిటీ AI కంపెనీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు రాసిన ఓ లేఖ సంచలనం రేపుతోంది. గూగుల్ క్రోమ్ బౌజర్‌ను కొనుగోలు చేయడానికి అరవింద్ శ్రీనివాస్ సుందర్ పిచాయ్‌కు లేఖ రాస్తూ భారీ ఆఫర్ ఇచ్చారు. 34.5 బిలియన్లకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు విక్రయించని సుందర్‌కు ఆఫర్ చేశారు. ఇది పెర్ప్లెక్సిటీ 14 బిలియన్ల వాల్యుయేషన్ రెట్టింపు కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులతో క్రోమ్ సంచలనం సృష్టిస్తోంది. అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించమని సుందర్ పిచాయ్‌కు ఆఫర్ ఇచ్చిన అరవింద్ శ్రీనివాస్ ఎవరు? ఇతని బ్యాగ్రౌండ్ ఏంటనే పూర్తి వివరాలు మీకు తెలియాలంటే మీరు ఆర్టికల్‌పై ఓ లుక్కేయాల్సిందే. 

ఇది కూడా చూడండి: ICICI Bank: దుమ్మెత్తి పోసిన ఖాతాదారులు.. వెనక్కు తగ్గిన ICICI బ్యాంక్!

పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ దేశంలోని చెన్నైలో జన్మించారు. అతను బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోకి వెళ్లే ముందు IIT మద్రాస్‌లో చదువుకున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో అరవింద్ ప్రముఖ ఏఐ పరిశోధకుడు యోషువా బెంగియోతో, అలాగే గూగుల్‌లో కూడా పని చేశారు. ఆ తర్వాత 2022లో డెనిస్ యారట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కిలతో కలిసి AI-ఆధారిత శోధన ఇంజిన్ అయిన పెర్ప్లెక్సిటీ AIని ప్రారంభించారు. చిన్న కంపెనీ అయిన  పెర్ప్లెక్సిటీ AI గూగుల్ క్రోమ్‌కి ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వైరల్ కావడానికే ఇలా చేస్తున్నట్లు..

గూగుల్ క్రోమ్ అనేది కేవలం బ్రౌజర్ మాత్రమే కాదు. ఇది గూగుల్ ఉత్పత్తిలో చాలా కీలకమైనది. గూగుల్ సెర్చ్, యాడ్ రెవెన్యూ జనరేషన్, క్లౌడ్ సేవలకు ఎంట్రీ గేట్ వంటిది. ఇలాంటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను మూడేళ్ల అనుభవం ఉన్న కంపెనీ కొనుగోలు చేస్తానని అనడం అందరికీ షాక్ కలిగేలా చేస్తోంది. అరవింద్ గూగుల్‌ను కొనడం చాలా కష్టమని అంటున్నారు. ఎందుకంటే అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడిప్పుడే టెక్ రంగంలో అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి భారీ ఆఫర్ చేసినా కూడా తనకి కొనుగోలు చేయడం కష్టమని పలువురు అంటున్నారు. తమ కంపెనీ వినియోగదారులను పెంచుకోవడానికి లేదా వార్తల్లో నిలవడానికి ఇలా చేసినట్లు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Oracle Lay offs: ఏఐ ఎఫెక్ట్‌కి బలి అవుతున్న ఉద్యోగులు.. ఒరాకిల్‌లో భారీగా కోత!

Advertisment
తాజా కథనాలు