/rtv/media/media_files/2025/10/07/kidney-inflammation-2025-10-07-07-15-36.jpg)
Kidney inflammation
నేటి కాలంలో ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరించడం, అభిమాన సెలబ్రిటీలలా కనిపించాలని కోరుకోవడం యువతలో సర్వ సాధారణం. అయితే ఈ మోజు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. చైనాలో 20 ఏళ్ల యువతి విషయంలో ఇదే జరిగింది. తనకిష్టమైన సెలబ్రిటీని అనుసరించి.. ప్రతినెలా హెయిర్ డై చేయించుకోవడంతో ఆమెకు తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తాయి. కొంతకాలంగా కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు, కాళ్లపై ఎర్రటి మచ్చలతో బాధపడుతున్న యువతిని పరీక్షించిన వైద్యులు.. ఆమెకు కిడ్నీ వాపు ఉన్నట్లు నిర్ధారించారు.
హెయిర్ డై అలవాటుతో కిడ్నీ జబ్బు:
జెంగ్‌జౌ పీపుల్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ టావో చెన్యాంగ్ మాట్లాడుతూ.. తరచుగా హెయిర్ డై వేయడం వల్ల పుర్రె చర్మం ద్వారా సీసం, పాదరసం (mercury) వంటి విషపూరిత పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయని తెలిపారు. దీనివల్ల ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఈ రకమైన ప్రమాదాలపై అమెరికాలోనూ కేసులు నమోదయ్యాయి. 2025లో మాజీ హెయిర్ స్టైలిస్ట్ హెక్టర్ కార్వెరా హెయిర్ డైలలోని కార్సినోజెనిక్ రసాయనాల కారణంగా తనకు బ్లాడర్ క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ 10 కంపెనీలపై దావా వేశారు.
ఇది కూడా చదవండి: ఈ 5 ఫుడ్ ఐటెమ్స్ కుక్కర్‌లో ఉడికిస్తే డేంజర్.. విషంతో సమానం.. లిస్ట్ ఇదే!
అయితే హెయిర్ డై లేదా బ్లీచింగ్ చేసేవారు ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. డై వేసే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి, వెంటనే తలస్నానం చేయకూడదు, అమ్మోనియా-రహిత, పారాబెన్-రహిత రంగులనే వాడాలి. చౌకబారు బ్రాండ్లకు దూరంగా ఉండాలి, జుట్టు దెబ్బతిని ఉంటే.. ముందుగా డీప్ కండిషనింగ్ చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలా జాగ్రత్తలను ముందుగానే పాటిస్తే సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఉదయం ఖాళీ కడుపుతో ఏం తింటే మంచిదో తెలుసా...?