/rtv/media/media_files/2025/10/06/cooker-2025-10-06-13-18-31.jpg)
Pressure cooker
ప్రెషర్ కుక్కర్ వంట సమయాన్ని తగ్గిస్తుంది. కానీ కొన్ని ఆహారాలను ఇందులో వండటం వలన వాటి పోషక విలువలు తగ్గిపోయి.. కొన్ని సందర్భాల్లో విషపూరితంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు ప్రతి భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్(cooker case) ఒక ముఖ్యమైన పాత్రగా మారింది. త్వరగా వంట పూర్తి చేసేందుకు చాలా మంది దీనిపై ఆధారపడుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు కుక్కర్‌లో అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించినప్పుడు వాటిలో ఉండే సహజ లక్షణాలు మారిపోయి.. ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా మారుతాయి. ప్రెషర్ కుక్కర్(pressure cooker) లో అస్సలు వండకూడని నాలుగు ప్రధాన ఆహారాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రెషర్ కుక్కర్‌లో వండకూడని ఆహారాలు:
బంగాళాదుంపలు (Potatoes): ఈ జాబితాలో బంగాళాదుంపలు మొదటి స్థానంలో ఉన్నాయి. కుక్కర్‌లో ఉడికించడం వల్ల వీటిలో ఉండే సహజ పోషకాలు చాలా వరకు నశించిపోతాయి. అంతేకాకుండా అధిక వేడి వద్ద వీటిలో ఎక్రిలమైడ్ (Acrylamide) అనే హానికరమైన పదార్థం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుంది.
బచ్చలికూర (Spinach):బచ్చలికూరను ప్రెషర్ కుక్కర్‌లో వండటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీనిని అధిక వేడిలో వండటం వలన అందులోని ఆక్సలేట్లు (Oxalates), ఇతర సమ్మేళనాలు పెరుగుతాయి. ఇది కిడ్నీలపై ఒత్తిడి పెంచి.. దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్ల (Kidney Stones) వంటి సమస్యలకు దారితీయవచ్చు.
ఇది కూడా చదవండి: ఖరీదైన ఫేషియల్స్‌తో పనిలేదు..ఇంట్లోనే ముఖం మెరిపించే సులభ చిట్కాలు
బియ్యం (Rice):ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండటం ఆరోగ్యకరం కాదని చెబుతారు. బియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్ (Phytic Acid) అధిక ఉష్ణోగ్రతలో పూర్తిగా విచ్ఛిన్నం కాదు. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తి.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
గుడ్లు (Eggs):గుడ్లను కుక్కర్‌లో ఉడికించడం వల్ల వాటిలోని ప్రోటీన్ల నిర్మాణం మారుతుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా అధిక వేడికి లోనవడం వల్ల గుడ్లలోని విటమిన్ D, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయి. త్వరగా వంట పూర్తి చేయాలనుకునేవారు ఈ నాలుగు ఆహారాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఇంట్లో పసుపు కందిరీగ గూళ్లతో ఇబ్బందిగా ఉందా..? ఖరీదైన స్ప్రేలు అవసరం లేకుండా సులభమైన ఇంటి చిట్కాలు