రూ.350 కోసం మర్డర్ చేసిన బాలుడు.. శవం ముందే డాన్స్ చేస్తూ
రూ.350 కోసం ఓ బాలుడు ఒక యువకుడిని హత్య చేసిన భయంకరమైన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వెల్కమ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి నడిచివెళ్తున్న వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడిచేసి చంపేసిన నిందితుడు శవంముందే డ్యాన్స్ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.