Gold And Silver: గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ప్రియులకు శుభవార్త. ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి దాదాపు 600 రూ. తగ్గింది. వెండి అయితే ఏకంగా 3 వేలు తగ్గింది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం ధర 1, 24, 260గా ఉంది.

New Update
Gold

Gold

నిన్న ఒక్కసారిగా పెరిగి భయపెట్టిన బంగారం , వెండి ధరలు(gold-and-silver-rates) ఒక్కరోజులోనే కిందకు పడిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా భారీగా తగ్గింది. గు వేయాల్సి వచ్చింది. అయితే, పసిడి ప్రియులకు ఈరోజు అదిరే శుభవార్త అందింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 100 మార్క్ దాటడంతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చన్న సంకేతాలు బంగారం ధరలు భారీగా తగ్గడానికి కారణమయ్యాయి. దీంతో నిన్న తులం బంగారం రూ.1.25 లక్షలు దాటగా అది ఇవాళ 1, 24, 260కి చేరింది. దాదాపు రూ.600 వరకు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 13, 900కి చేరింది. ఇదే బంగారం నిన్నటి ధర రూ. 1,14, 450 గా ఉంది. అంటే రూ. 550 తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1, 24, 410కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1, 14, 050 కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 24, 260గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 1, 13, 900కి దిగింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈరోజు బంగారం ధరలు భారీగానే తగ్గాయి.స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 15 డాలర్ల మేర పడిపోయింది. దీంతో ఔన్స్ పసిడి 4066 డాలర్ల వద్దకు దిగివచ్చింది. అలాగే ఔన్స్ సిల్వర్ ధర 1.42 శాతం మేర పడిపోయింది. దీంతో వెండి ఔన్సు రేటు 50.37 డాలర్ల వద్దకు దిగివచ్చింది.

Also Read :  65 అంగుళాల పెద్ద టీవీ.. కుమ్మేసిన ఆఫర్లు - మిస్సైతే మళ్లీ కొనలేరు..!

రూ.3వేలు తగ్గిన వెండి..

ఇక వెండి విషయానికి వస్తే ఇది భారీగా తగ్గిందని చెబుతున్నారు. కేజీ మీద దాదాపు రూ.3 వేల వరకు ధర తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,73,000 వద్దకు దిగివచ్చింది.దీంతో ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో రూ. 1, 73, 000, విజయవాడలో రూ. 1, 73, 000, ఢిల్లీలో రూ. 1, 65, 000, చెన్నైలో రూ. 1, 73, 000, కోల్‌కతాలో రూ. 1, 64, 900, కేరళలో రూ. 1, 73, 000, ముంబైలో రూ. 1, 64, 900, బెంగళూరులో రూ. 1, 64, 900, 

పై రేట్లు అన్నీ మార్కెట్లో ఉదయం ఉన్న ధరలు. ఇవి మధ్యాహ్నానికి మారవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు చేసే ముందు ధరలను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: UK: యూకేలో స్థిరపడాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్..పదేళ్ళు ఉంటేనే గానీ..  

Advertisment
తాజా కథనాలు