Mass Jathara Teaser: రవితేజ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మాస్ జాతర' టీజర్ వచ్చేసింది. వింటేజ్ రవితేజ వైబ్స్ తో టీజర్ అమాంతం ఆకట్టుకుంటుంది. పోలీస్ గెటప్ లో రవితేజ మాస్ యాక్షన్, డైలాగ్స్ అలరిస్తున్నాయి. గుండాలను చితకబాదుతూ తన మాస్ స్టైల్ ని మరోసారి చూపించారు రవితేజ. టీజర్ చూస్తుంటే 'మాస్ జాతర' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. యాక్షన్ తో పాటు కామెడీ, రొమాన్స్ పుష్కలంగా ఉంటాయని అర్థమవుతోంది. 'ధమాకా' సినిమాతో హిట్టు కొట్టిన రవితేజ- శ్రీలీల జోడీ మరో సారి కలిసి నటించారు. టీజర్ వీరిద్దరి మధ్య కామెడీతో కూడిన రొమాంటిక్ సన్నివేశాలు నవ్వులు పూయించాయి. టీజర్ చూసిన ఫ్యాన్స్ వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
27న థియేటర్స్ లో
ఇప్పటివరకు రవితేజ క్రాక్, విక్రమార్కుడు, వాల్తేరు వీరయ్య ఇలా పలు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఇప్పుడు 'మాస్ జాతర' సినిమాతో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతున్నారు. టీజర్ తో పాటు విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. వినాయకచవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు తెలిపారు.
Serving up a full-meals mass entertainment feast this time 🤗
— Ravi Teja (@RaviTeja_offl) August 11, 2025
Enjoy the #MassJatharaTeaser !https://t.co/t4tqjox6ww
See you in theatres on August 27th 🔥#MassJathara#MassJatharaOnAug27thpic.twitter.com/M2TiRFsXm8
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ- సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ రవితేజ తండ్రి పాత్రలో నటించారు. భాను బోగరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మ్యూజికల్ హిట్ కొట్టిన భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. టీజర్ భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'ఈగల్' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రవితేజకు ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది. టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంచనా వేస్తున్నారు.
థియేటర్ బిజినెస్
ఇదిలా రవితేజ ఇటీవలే ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో థియేటర్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. వనస్థలిపురంలోని తత్త్వ మాల్ ART సినిమాస్ పేరుతో థియేటర్ ఓపెన్ చేశారు. 57 అడుగుల వెడల్పు గల EPIQ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 4K వీడియో నాణ్యత వంటి అధునాతన లక్షణాలను కలిగి ఉంది. ఇవి మంచి సినిమా అనుభూతుని అందిస్తాయి.
Also Read: BIGG BOSS 9 Promo: ఈసారి బిగ్ బాసే మారిపోయాడు.. ఫుల్ ట్విస్టులతో బిగ్ బాస్ కొత్త ప్రోమో !