/rtv/media/media_files/2025/08/08/coolie-advance-booking-2025-08-08-18-37-33.jpg)
Coolie Advance Booking
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ చేసిన కూలీ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. దీని కోసం తెలుగు, తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ హీరోగా, మన్మథుడు నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్ గా చేస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. కూలీలో స్టైల్, మాస్ ఎలిమెంట్స్ తో పాటూ కంటెంట్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది.
యంగ్ రజనీ గా స్టార్ హీరో...
ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలలో లోకేష్ మాట్లాడుతూ .. ‘మీరు ఊహించని సర్ప్రైజ్‌లు ఈ సినిమాలో ఉంటాయి’ అని చెప్పాడు. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు కూలీ మూవీకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. ఇందులో రజనీ కాంత్ కు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అయితే మిగతా అన్ని సినిమాల్లో లాగా ఇందులో ఆయనను యంగ్ లుక్ లో మేకప్ వేయించి చూపించలేదని...ఆ పాత్రలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ను పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో రజనీకాంత్ మాస్ వేరే లెవెల్‌లో ఉంటాడని అందుకే ఆ పాత్రలో శివ కార్తికేయన్ ను పెట్టారని చెబుతున్నారు. ట్రైలర్ లో చివర్లో కనిపిస్తున్నది అతనేనని అంటున్నారు.
Siapa tak sabar utk filem COOLIE?
— #ZHAFVLOG (@zhafvlog) August 10, 2025
COOLIE - Official Trailer pic.twitter.com/vjioML9RKm
కూలీ సినిమా గురించి దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఒక ఇంటర్వూలో చెప్పిన విషయం కూడా ఈ గాసిప్ కు ఊతం ఇస్తోంది. రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రయత్నించని విధంగా చేశానని లోకేశ్ చెప్పాడు. రజనీకాంత్‌కు యంగ్ గెటప్ వేసి చేయించలేదని, ప్రత్యేకంగా చెప్పడం చూస్తే ఈ రూమర్ నిజమనే అనిపిస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నిజంగానే ఇదొక పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పాలి. దీని ద్వారా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రజనీ కాంత్ కు కానీ..మరే ఇతర హీరోలతో కానీ ఇలాంటి ప్రయోగం చేయలేదు. మరో నాలుగు రోజుల్లో ఈ సర్ ప్రైజ్ నిజమో కాదో తేలిపోనుంది. ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా కూలీ సినిమా విడుదల కానుంది.
Also Read: GAZA: ఐదుగరు జర్నలిస్టులను చంపేసిన ఇజ్రాయెల్ సైన్యం..హమాస్ టెర్రరిస్టులని నెపం