Job: సీఎం బురఖా లాగాడని.. మహిళా డాక్టర్‌కు నెలకు రూ.3 లక్షలు ఆఫర్

బీహార్ CM నితీష్ కుమార్ ఇటీవల మహిళా డాక్టర్ బురఖా లాగిన ఘటన దేశవ్యాప్తంగా వివాదస్పమైంది. ఆయుష్ డాక్టర్‌ అపాయిట్‌మెంట్ లెటర్ తీసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ నుస్రత్ పర్వీన్ డిసెంబర్ 20 విధుల్లో చేరాల్సి ఉండగా, ఆమె విధులకు హాజరుకాకపోవడం గమనార్హం.

New Update
_Jharkhand Health Minister offers

Jharkhand Health Minister offers

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(bihar-cm-nitish-kumar) ఇటీవల ఓ మహిళా డాక్టర్ బురఖా(burqa) లాగిన ఘటన దేశవ్యాప్తంగా వివాదస్పమైంది. ఆయుష్ డాక్టర్‌గా నియామకమైన ఆమెకు అపాయిట్‌మెంట్ లెటర్ ఇస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళా డాక్టర్(Bihar doctor) నుస్రత్ పర్వీన్(nusrat parveen) శనివారం (డిసెంబర్ 20) నాడు తన విధుల్లో చేరాల్సి ఉండగా, ఆమె విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. జార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఆమె బంపరాఫర్ ఇచ్చాడు. ఆ మహిళా డాక్టరుకు జార్ఖండ్‌లో రూ.3 లక్షల జీతంతో ఉద్యోగం, నివాసం కల్పిస్తామని చెప్పాడు. అయినా ఆమె నుంచి ఏ స్పందన రాలేదు.

Also Read :  ISRO ఖాతాలో మరో విజయం.. గగన్‌యాన్ పారాచూట్‌ టెస్ట్ సక్సెస్

Jharkhand Health Minister Offers Job

డిసెంబర్ 15న పాట్నాలో ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు అందజేసే అధికారిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నుస్రత్ పర్వీన్ పత్రాన్ని అందుకునేందుకు వేదికపైకి రాగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆమె ముఖానికి ఉన్న బురఖా తీసి చూసి, "ఇదేమిటి?" అని అడుగుతూ స్వయంగా దానిని తొలగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు తీవ్ర స్థాయిలో నితీష్‌పై మండిపడ్డాయి.

నియామక పత్రం అందుకున్న తర్వాత శనివారం సాయంత్రం 7 గంటల లోపు ఆమె విధుల్లో చేరాల్సి ఉంది. పాట్నాలోని సబల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, అధికారులకు ఆమె నుండి ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురైందని సమాచారం. నుస్రత్ పర్వీన్ ప్రస్తుతం తన నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నారని, ఆమె విధుల్లో చేరుతారో లేదో అనే విషయంపై స్పష్టత లేదని అధికారుల ద్వారా తెలుస్తోంది. మీడియా ముందకు వచ్చేందుకు కూడా ఆమె ఇబ్బంది పడుతున్నారు.

Also Read :  ఉద్యోగులకు అలర్ట్.. మీ పే స్లిప్, ఆఫర్ లెటర్లు మారబోతున్నాయి.. ఎలా ఉంటాయో తెలుసా?

ఈ కేసులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ఆమె విధుల్లో చేరే గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హెల్త్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ఆమెతో పాటు మరికొందరు అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఈ గడువును పెంచినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ నుస్రత్ ప్రస్తుతం మీడియా హడావిడి తగ్గే వరకు బయటకు రాకూడదని భావిస్తున్నట్లు ఆమె చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్ మహఫుజుర్ రెహ్మాన్ తెలిపారు. ముఖ్యమంత్రి చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఇది ఓ మహిళా గౌరవానికి, స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగించడమేనని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది.

బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాత్రం ముఖ్యమంత్రిని సమర్థిస్తూ.. నితీష్ కుమార్ ఆ యువతిని తన కూతురిలా భావించి అలా చేశారని, దీనిని వివాదం చేయవద్దని కోరారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జాతీయ స్థాయి వివాదంగా మారింది. నుస్రత్ పర్వీన్ తన వృత్తిని కొనసాగిస్తారా లేదా ఈ అవమానంతో ఉద్యోగాన్ని వదులుకుంటారా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. - viral news telugu

Advertisment
తాజా కథనాలు