/rtv/media/media_files/2025/11/23/new-labour-codes-2025-11-23-09-53-46.jpg)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగు కొత్త లేబర్ కోడ్ లను అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ఉద్యోగుల పనితీరులో చాలా పెద్ద మార్పులే చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా వేతనాల విషయంలో సమూల మార్పులు రానున్నాయి. ఈ కొత్త చట్టాలు అమలులోకి వస్తే ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగుల పనితీరు, వేతన నిర్మాణం, సెలవుల నిబంధనలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా అపాయింట్ మెంట్ లెటర్, శాలరీ స్లిప్ మారబోతున్నాయి.
మారనున్న శాలరీ స్ట్రక్చర్..
కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం..ఉద్యోగి పొందే మొత్తం గ్రాస్ శాలరీలో ప్రాథమిక వేతనం, కనీసం 50 శాతం ఉండాలి. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక వేతనాన్ని తక్కువగా చూపిస్తూ, అలవెన్సులను ఎక్కువగా ఇచ్చేవి. కానీ కొత్త చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ, ఓవర్ టైమ్ వంటి అలవెన్సులు మొత్తం జీతంలో 50 శాతానికి మించకూడదు. దీంతో కంపెనీలు తమ ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్‌ను మార్చాల్సి ఉంటుంది. ప్రాథమిక వేతనం పెరగడం వలన ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్, కంపెనీ ఇచ్చే గ్రాట్యూటీ వాటా పెరుగుతుంది. దీనివల్ల ప్రతీనెలా ఉద్యోగి చేతికి వచ్చే నికర జీతం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటూరిటైర్మెంట్ టైమ్ లో PF, గ్రాట్యుటీ గణనీయంగా పెరుగుతాయి. ఇది ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
సెలవులు బదిలీ చేసుకోవచ్చు..
కొత్త కోడ్ ల ప్రకారం రోజుకు ఎనిమిది గంటలు, వారానికి 48 గంటలు పని చేయాలనే నియమం అలానే ఉంటుంది. కానీ వాటిని ఎలా ఏర్పాటు చేసేకోవచ్చనేది మాత్రం మారుతుంది. దీనిని వారంలో నాలుగు రోజులు 12 గంటలు, ఐదు రోజులు వారాంలో దాదాపు 9.5 గంటలు, ఆరు రోజులు వారంలో రోజుకు ఎనిమిది గంటలు కింద విభజించుకోవచ్చును. దీంతో పాటూ ఓవర్ టైమ్ పరిమితిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత పరిమితులను నిర్ణయించుకోవచ్చు. అయితే ఒక ఏడాది ముగిసే సమయానికి ఉద్యోగి ఖాతాలో మిగిలిపోయిన సెలవులను తదుపరి ఏడాదికి బదిలీ చేసుకోవచ్చు లేదా వాటిని నగదుగా మార్చుకునే నిబంధనలను కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
కొత్త లేబర్ కోడ్ వలన ఉద్యోగులు లాభపడే మరో అంశం ఏంటంటే..ఉద్యోగులకు ఊరటనిచ్చే మరో ప్రధాన మార్పు ఏమిటంటే, ఒక ఉద్యోగి రాజీనామా చేసినా లేదా ఉద్యోగం నుంచి తొలగించబడినా.. వారికి రావాల్సిన బకాయిలు, పూర్తి సెటిల్మెంట్ను కంపెనీ కేవలం రెండు పని దినాలలోపే పూర్తి చేయాలి. ఇప్పటి వరకు చాలా కంపెనీలు దీని కోసం 30 నుంచి 90 రోజుల సమయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోతుంది. కొత్త రోడ్ అమల్లోకి రాగానే కంపెనీలు తమ హెచ్ఆర్ పాలసీలను, ఉద్యోగుల అపాయింట్మెంట్ ఒప్పందాలను కొత్త చట్టాలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది.
Follow Us