/rtv/media/media_files/2025/04/27/2wBnfD0bWwRQwUwsTWHK.jpg)
Rajinikanth flight video viral
Rajinikanth సూపర్ స్టార్ తలైవా ఎంతో సింపుల్ గా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం అభిమానులను ఆనందపరిచింది. ఇటీవలే షూటింగ్ నేపథ్యంలో ఫ్లైట్ జర్నీ చేసిన రజినీకాంత్ ఇండిగో విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. రజినీని తమతో పాటు విమానంలో చూడడం ప్రయాణికులతో ఉత్సాహాన్ని నింపింది. ఆయన రాగానే ప్రయాణికులంతా తలైవా.. తలైవా అంటూ కేకలు వేస్తూ వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. తలైవా కూడా చిరునవ్వుతో వారికి హాయ్ చెప్పి.. పలకరించారు.
Superstar Rajinikanth turns a flight🛫 into theatre with huge reception, post Jailer2️⃣ shoot. pic.twitter.com/hOrqpRdgsS
— Manobala Vijayabalan (@ManobalaV) April 25, 2025
అందుకే హంబుల్ సూపర్ స్టార్
ఇందుకు సంబంధించిన వీడియోను మనోబాల విజయబాలన్ Xలో షేర్ చేస్తూ.. సూపర్ స్టార్ రజినీ భారీ ఆదరణతో విమానాన్ని థియేటర్ గా మార్చారు అని క్యాప్షన్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు తలైవా సాధారణంగా అందరితో కలిసి ప్రయాణించడాన్ని ప్రశంసిస్తున్నారు. ఫరెవర్ హంబుల్ సూపర్ స్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో అభిమాని తెరపై ఆయనను చూసి ఎప్పుడూ అలసిపోలేదు అని రాశారు.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజినీ కాంత్ చివరిగా 2024లో 'వేట్టయాన్' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'కూలీ', నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్2 చేస్తున్నారు. 'కూలీ' ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఆగష్టు 14న విడుదల కానుంది. ఇక 'జైలర్2' విషయానికి వస్తే.. జనవరిలో అనౌన్స్ ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది. ఫస్ట్ షెడ్యూల్ చెన్నైలో జరిగినట్లు సమాచారం.
latest-news | telugu-news | cinema-news
Also Read: Viral Video: హీరో విజయ్ని చూడటానికి చెట్టు మీద నుండి దూకిన క్రేజీ అభిమాని (వీడియో వైరల్)