/rtv/media/media_files/2025/04/27/SuU0YKbKAdvsQJgrlwXG.jpg)
Pahalgam Attack
Pahalgam Attack: పహల్గాం అటాక్‌లో భాగమైన ఉగ్రవాది ఆదిల్‌ను లొంగిపోవాలంటూ తన తల్లి షాజా బానో వేడుకుంటోంది. 2018లో ఇంటినుంచి పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి రాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. తన బిడ్డ అమాయకుడని, తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కన్నీటిపర్యంతమైంది.
Also Read : భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు
2018లో పరీక్ష రాసేందుకు వెళ్లి..
ఈ మేరకు పాక్ లోకల్ మీడియాతో మాట్లాడిన షాజా బానో.. పహల్గాం దాడిలో నిందితుడిగా ఉంటే ఆదిల్ హుస్సేన్ లొంగిపోవాలని సూచించింది. 'ఆదిల్ మన ఫ్యామిలీ ప్రశాంతంగా జీవించాలనుకుంటుంది. నీవు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటే నేను నమ్మట్లేదు. కానీ ఒకవేళ ఈ దాడిలో భాగమస్వాముడివైతే లొంగిపో. నేరం రుజువైతే ఆదిల్ పై ప్రభుత్వాలు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. 2018లో పరీక్ష రాసేందుకు ఆదిల్ ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికి తిరిగిరాలేదు' అంటూ షాజా దుఃఖిస్తోంది.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పౌరులను తిరిగి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియనుంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ పౌరులు అట్టారి సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఇందులో భాంగంగానే అట్టారి సరిహద్దు వద్ద ఒక తల్లి, ఇద్దరు పిల్లల ఎమోషనల్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇది అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. తల్లికి భారతీయ పాస్‌పోర్ట్ ఉండగా ఆమె కూతురు (8), కొడుకు (6)కు పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉంది. దీంతో తమ పిల్లలను వీడి ఉండలేక కన్నీటిపర్యంతమయ్యారు. కూతురు ఏడుస్తూ 'అమ్మ లేకుండా ఉండలేము' అని ఏడవటం అందరి హృదయాలను కదిలించింది.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
Also Read : బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఈ రోజ్ టీ తాగితే సరి
attack in Pahalgam | telugu-news | today telugu news