Intelligence Agencies Alert: ఢిల్లీలో హై అలర్ట్.. కోడ్ నేమ్ 2026‌తో ఉగ్రదాడులకు ప్లాన్!

దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ప్లాన్ చేయడంతో దీనికి ఉగ్రవాదులు ‘కోడ్ నేమ్ 26-26’ అని పేరు పెట్టినట్లు సమాచారం.

New Update
terror attack

దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుండగా ఉగ్రవాదులు దేశ రాజధానిని రక్తసిక్తం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు(Terror Attack) ప్లాన్ చేయడంతో దీనికి ఉగ్రవాదులు ‘కోడ్ నేమ్ 26-26’ అని పేరు పెట్టినట్లు సమాచారం. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ డైరెక్షన్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా, జమ్మూ కాశ్మీర్, అయోధ్యలోని రామ మందిరం కూడా వీరి టార్గెట్ లిస్టులో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు(Intelligence Agencies Alert) తెలిపాయి. స్థానిక గ్యాంగ్‌స్టర్లు, సోషల్ మీడియా ద్వారా రాడికలైజ్ అయిన యువతను ఉపయోగించి 'లోన్ ఉల్ఫ్' దాడులు చేయవచ్చని నిఘా విభాగం హెచ్చరించింది.

Also Read :  సామాన్యుని పాలిట బడ్జెట్ వరమా? శాపమా?.. ట్యాక్స్ స్లాబ్ లు మారతాయా?

పోలీసుల వేట.. ‘వాంటెడ్’ నోటీసులు

ఈ ముప్పును తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు(Delhi Police Investigation), కీలక ఉగ్రవాదుల(terrorist) ఫొటోలతో కూడిన ‘వాంటెడ్’ పోస్టర్లను నగరం అంతటా ప్రదర్శిస్తున్నారు. 
మొహమ్మద్ రెహాన్: అల్-ఖైదాకు చెందిన ఇతను ఢిల్లీ నివాసిగా గుర్తించారు.
షాహిద్ ఫైసల్: గతంలో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారి.
వీరితో పాటు మరికొందరు అనుమానిత ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read :  ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే దిశగా.. భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం..

కట్టుదిట్టమైన భద్రత
వేడుకలు జరిగే కర్తవ్య పథ్, ఎర్రకోట, రద్దీగా ఉండే మెట్రో స్టేషన్ల వద్ద నిఘా ముమ్మరం చేశారు. ఢిల్లీ ఆకాశంలో డ్రోన్లు, పారాగ్లైడర్లు ఎగరకుండా నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ ప్రదర్శన సమయంలో పక్షులు అడ్డురాకుండా ఉండేందుకు డేగలకు ప్రత్యేకంగా ఆహారం వేసి వాటిని దారి మళ్లించే వినూత్న పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. - terror attack plan on Republic Day

Advertisment
తాజా కథనాలు