India-EU: ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే దిశగా..భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం..

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం కీలక దశకు చేరుకుంది. ఇదొక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అని..ప్రపంచ వాణిజ్యాన్ని మార్చేయగలదని ఈయ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అంటున్నారు. దావోస్ ఆమె ఈ వ్యాఖ్యలను చేశారు. 

New Update
india-EU

చాలా రోజులుగా జరుగుతున్న భారత్, ఈయూ మధ్య వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి రానున్నాయని తెలుస్తోంది. తొందరలోనే రెండు దేశాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ చెబుతున్నారు. భారత్, ఐరోపా సమాఖ్య మధ్య వాణిజ్య ఒప్పందం ఒక కీలక దశకు చేరుకుందని, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే చారిత్రాత్మక ఒప్పందం కావచ్చని ఆమె తెలిపారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉర్సులా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం జరిగితే రెండు బిలియన్ల ప్రజలకు మార్కెట్ అందుబాటులోకి వస్తుందని...ఇది ప్రపంచ జీడీపీలో నాలుగో వంతని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ సుంకాలు కొనసాగుతున్న వేళ భారత్, ఈయూ ల మధ్య ఈ వాణిజ్య ఒప్పందానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 

ఇదొక చారిత్రాత్మక ఒప్పందం..

ఇంకా చేయాల్సిన పని ఉంది. కానీ మనం ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అంచున ఉన్నాము. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలకు వాణిజ్య పురోగతిగా మారుతుందని ఉర్సులా చెప్పారు. EU తన వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరచడానికి,  రిస్క్‌ను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నంపై దృష్టి సారించిందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకదానిని ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర స్తంభంగా మిగిలి ఉన్న ఒక కూటమితో అనుసంధానించడం ద్వారా వాణిజ్యం మరింత వేగంగా విస్తరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈయూ...చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్ తో ఒప్పదం కుదిరితే..ఇది తగ్గుతుంది. ఈ ఒప్పందం సుంకాలపై న్యాయమైన వాణిజ్యం, ఒంటరితనంపై భాగస్వామ్యం, దోపిడీపై సుస్థిరత..ఐరోపా వ్యూహంలో భాగమని ఉర్సులా తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచుకోవడానికి, సరఫరా గొలుసులను వైవిధ్యపరచడానికి ఈయూ కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రపంచంలోని ప్రధాన వృద్ధి కేంద్రాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ దావోస్ సదస్సు తర్వాత తాను భారత్ కు వెళతానని ఉ్సులా తెలిపారు. అక్కడే తమ ఒప్పందంపై తుది అడుగులు పడతాయి చెప్పారు. స్వచ్ఛమైన సాంకేతికతలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఔషధాలు, కీలక ముడి పదార్థాల వంటి వాటిపై ఈ ఒప్పందం జరగనుంది. ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్..ఈ శతాబ్దపు ఆర్థిక శక్తి కేంద్రాలలో ఒకటిగా ఉందని ఆమె ప్రశంసించారు. యూరప్ ఇలాంటి వాటితోనే ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తోందని చెప్పారు. 

ఈ నెలలో భారత్ పర్యటన..

ఐరోపా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, ప్రెసిడెంట్ వాన్ డెర్ లేయెన్ ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జనవరి 25 నుంచి 27 వరకు భారత్ పర్యటించనున్నారు. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. జనవరి 27న ప్రధాని మోదీతో కలిసి 16వ ఇండియా-EU సమ్మిట్‌ను కూడా వారు నిర్వహించనున్నారు. ఈ ఒప్పందం కుదిరితే.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇది కేవలం సుంకాలకే పరిమితం కాకుండా, సేవలు, పెట్టుబడులు, డిజిటల్ వాణిజ్యం, సుస్థిరత ప్రమాణాలు, నియంత్రణ సహకారం వంటి అంశాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తాయి.

Also Read:  Macron: దావోస్ లో నిరసన సెగలు..మండిపడ్డ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్

Advertisment
తాజా కథనాలు