Bihar Elections 2025: డబ్బున్నోళ్ళదే ప్రజాస్వామ్యం.. బీహార్ ప్రజల ఎన్నికల తీర్పు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో గెలిచింది. అయితే ఇందులో కూడా బాగా డబ్బులున్న నాయకులనే ప్రజలు ఎన్నుకొన్నారు. పేద వారిని కన్నెత్తి కూడా చూడలేదు.

New Update
bihar elections (1)

డబ్బున్నోళ్ళదేప్రజాస్వామ్యం..దీనిని బీహార్ ప్రజలు మరోసారి నిరూపించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌కూఅందనంతగా అప్రతిహత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది. అయితే గెలిచిన వారందరూ బాగా డబ్బున్నోళ్ళు, పలుకుబడి, పరపతి కలిగిన వారు.

Also Read :  మధ్యప్రదేశ్ నుంచి బీహార్ వరకు.. బీజేపీ గెలుపు వెనుక ఉన్న ఓటర్లు వాళ్లే.. ఇంట్రెస్టింగ్ లెక్కలు!

ధనికులకే మా ఓటు..

బీహార్ అసెంబ్లీ ఎన్నిక(Bihar Elections 2025) ల్లో మొత్తం 2600 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నవారి దగ్గర నుంచీ రూ.1200ల ఆస్తి ఉన్న వారు వరకూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎక్కువగా ధనిక నేతలే ఉన్నారు. అయితే పేద వారిగా తక్కువ ఆదాయం చూపెట్టిన వారు కూడా ఓ పది మంది దాకా ఉన్నారు. అన్ని విషయాల్లో లాగానే ఇక్కడ కూడా ధనికులే విజయం సాధించారు. రాష్ట్ర మొత్తం మీద ఒక్క పేద నేత కూడా గెలవలేదు.

రూపాయల్లో ఆస్తులు..

బీహార్ ఎన్నికల్లో వార్తల్లో నిలిచిన అభ్యర్థి సునీల్ కుమార్ చౌదరి. ఈయన బహూజన్ సమాజ్ పార్టీ కి చెందిన నేత. భాగల్పూర్ జిల్లాలోని రిజర్వ్డ్ సీటు అయిన పిర్పైంటి నుండి పోటీ చేశారు. అయితే సునీల్ కుమార్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈయనకు కేవలం 1, 586 ఓట్లు మాత్రమే వచ్చాయి. పిర్పైంటి నుంచి బీజేపీ అభ్యర్థి మురారి పాశ్వాన్ గెలిచారు. 40 ఏళ్ళ సునీల్ కుమార్ చౌదరి తన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన వివరాలు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. తాను కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని..ఉద్యోగం లేదని చెప్పారు. దాంతో పాటూ తనకు ఆదాయం, అప్పులు లేవని కూడా రాశారు. నిలక విలువ సున్నా అని ప్రకటించారు. బీహార్ ఎన్నికల్లో అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు చేయగా..సునీల్ కుమార్ మాత్రం రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈయనపై ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా లేవు. తనకు అట్టడుగు స్థాయిలో ఉన్న మద్దతుతోనే ఆ 1,586 ఓట్లను కూడా గెలుచుకున్నారు. ఈయనలాగే.. ₹1,000, ₹2,000, ₹3,000, ₹4,000, ₹5,000 లేదా ₹6,000 మొత్తం ఆస్తులు కలిగిన మరో మరో పది మంది పేద అభ్యర్థులు ఉన్నారు. వారు కూడా ఎన్నికల్లో గెలవలేదు. డబ్బులు, పలుకుబడి ఉన్నవారికి మాత్రమే పట్టం కట్టారు బీహార్ ప్రజలు. 

Also Read :  జమ్మూ కశ్మీర్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు

Advertisment
తాజా కథనాలు