/rtv/media/media_files/2025/05/02/BKmjhOAtYnDAkmgCf7C5.jpg)
Warships enter the Arabian Sea Photograph: (Warships enter the Arabian Sea)
Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను అష్టదిగ్భందనం చేస్తోంది భారత్. ఓవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేలా కార్యకలాపాలు చేపట్టడంతో పాటు ఆదేశంలో యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోంది. దీనికి తోడు సాగర తీరంలోనూ నౌకలను మోహరిస్తోంది. పహల్గాం ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు వేల సంఖ్యలో సైనికులను మోహరించింది. వీటితో పాటు సముద్ర జలాల నుంచి దాడి చేయగల అత్యాధునిక యుద్ధ నౌకలను భారత్ మోహరించింది. అందులో కీలకమైనవి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్. ఇవి ఇప్పుడు ఆరేబియా మహా సముద్ర జలాల్లో గస్తీకి సిద్ధమయ్యాయి.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
ఇప్పటి వరకు తూర్పు వైపున ఉన్న ఈ రెండు యుద్ధ నౌకలు.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆరేబియా సముద్రంలోకి వచ్చేశాయి. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్‌ఎస్ సూరత్‌ను.. అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తిస్థాయి ఆటోమేషన్‌తో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. 45 రోజుల పాటు ఏకధాటిగా 8 వేల నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా ఐఎన్ఎస్ సూరత్‌కు ఉంది.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
ఇందులో 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది ఉంటారు. వీరంతా సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు, మల్టీ ఫంక్షన్ రాడార్, బ్యాండ్ ఎయిర్ సెర్చ్ రాడార్, సర్ఫేస్ సెర్చ్ రాడార్ వాటి కోసం పనిచేస్తారు. ఈ నౌకలో 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ సూరత్ రెండు వెస్ట్‌ల్యాండ్ సీకింగ్ విమానాలు లేదా రెండు హెచ్‌ఏఎల్ ధృవ్ విమానాలను మోసుకెళ్లగలదు. ఈ నెల 24న ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది.. సముద్రతలానికి చేరువగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది. యుద్ధవిమానాలు, యూఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేల కూల్చడానికి ఎంఆర్‌శామ్ ఉపయోగపడుతుంది.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
ఉగ్రదాడి అనంతరం నౌకాదళం చేపట్టిన చర్యల్లో ముఖ్యమైంది.. విమానవాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ మోహరింపు. ఇది కర్ణాటకలోని కార్వార్ నౌకాస్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో చేరినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టంచేశాయి. ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో సంచరిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన భారీ యుద్ధనౌక కదలికలు పాక్‌లో గుబులు పుట్టిస్తున్నాయి.
క్యారియర్ బ్యాటిల్ గ్రూప్
ఇక విమానవాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధనౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళుతుంది. వీటన్నింటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (CBG)గా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన దాడి బృందం. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. విక్రాంత్ కదలికలను బట్టి.. పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ , గ్వాదర్‌ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఆ దేశ వాణిజ్యంలో 60 శాతానికిపైగా ఈ రేవుల నుంచే సాగుతోంది. పాక్ తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. దిగ్బంధం వల్ల దేశంలో పెట్రోలు, డీజిల్‌తోపాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. దేశంలోని దాదాపు మూడోవంతు విద్యుదుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌పై విక్రాంత్ దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువభాగం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. ఒకవేళ యుద్ధం చేయాల్సివస్తే విక్రాంత్.. కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్యారియర్ గ్రూప్.. వాయు, ఉపరితల, సముద్రగర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించగలదు. విక్రాంత్‌పై ఉండే మిగ్-29కె ఫైటర్ జెట్‌లు పాకిస్థాన్‌లోని మస్రూర్, సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను నాశనం చేయగలవు. ఈ యుద్ధవిమానాలు ఏకబిగిన 850 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు. భారత వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్ సైనిక ఆదేశిక, నియంత్రణ వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయవచ్చు.
క్షిపణి పరీక్ష విజయవంతం
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తున్న వేళ, భారతదేశం సాహసోపేత ప్రయోగం చేసింది. ఏప్రిల్ 24 గురువారం నాడు భారత నావికాదళానికి చెందిన పూర్తి స్వదేశీ యుద్ధనౌక INS సూరత్ క్షిపణిని అరేబియా సముద్రంలోని లక్ష్యంపై విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరీక్ష భారత నావికాదళం వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం వైపు మరో బలమైన అడుగు పటినట్లైంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?