/rtv/media/media_files/2025/05/01/zzvWV9GuwQXpgEeKnMjU.jpg)
పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. సర్వోన్నత న్యాయస్థానం దీనిపై సీరియస్ అయ్యింది. ఉగ్రవాదులు చేసిన పనికి ప్రతీకారం తీర్చుకుందామని సైన్యం సిద్ధమవుతుండగా.. వారిని నిరుత్సాహ పరిచడమే ఈ పిటిషన్ ఉద్దేశమా అని బెంచ్ ప్రశ్నించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎప్పటి నుంచి ఉగ్రవాద నిరోధక దర్యాప్తులో నిపుణులుగా మారారు? అని ప్రశ్నించింది. కోర్టు ఈ విషయంలో పిటిషన్ వేసిన వారిపై ఫైర్ అయ్యింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసేటప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలని మండిపడింది. పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసే ముందు బాధ్యత వహించండి. మీకూ దేశం పట్ల కూడా బాధ్యత ఉంది. ఇండియన్ ఆర్మీని నిరాశపరిచే మార్గమేనా ఇది అని వ్యాఖ్యానించారు.
India's Supreme Court has slammed a petitioner & junked his plea for seeking judicial probe into #PahalgamTerrorAttack, stating that such petitions only seek to demoralize forces at a time when every citizen of the country has united to fight #Terrorism #SupremeCourtOfIndia pic.twitter.com/dn8MNT01G2
— TheSouthAsianTimes (@TheSATimes) May 1, 2025
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన దాడిపై ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న కాశ్మీరి విద్యార్థుల తరుపున ఈ పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ ఆందోళన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా ఉంది. వారు కూడా ఇలాంటి భయాలను వ్యక్తం చేశారు. దాడి ఎలా జరిగింది, ఏదైనా భద్రతా లోపాలు ఉల్లంఘనకు దోహదపడ్డాయా అనే దానితో సహా సంఘటన అన్ని అంశాలను పరిశీలించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును చేపట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత లష్కరే తోయిబా ప్రతినిధి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గామ్‌లో ఈ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. వారం రోజులకు పైగా గడిచినా నిందితులు పరారీలో ఉన్నారు. సైన్యం, లోకల్ పోలీసులు, BSF దళాలు, నిఘా సంస్థలు కలిసి దాడికి పాల్పడిన టెర్రరిస్టుల కోసం వెతుకుతున్నారు.
(supreme-court | attack in Pahalgam | pahalgam army operation | india pak war | india pak war news | supreme court petition)