/rtv/media/media_files/2025/10/04/family-cremates-another-man-2025-10-04-21-17-02.jpg)
Family Cremates Another Man After Bodies' Mix Up in Delhi
ఢిల్లీలో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. మార్చురీలో మృతదేహాలు మారడంతో ఓ కుటుంబం వేరే మృతదేహానికి అంత్యక్రియలు చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో ప్రేమ్‌నగర్‌లో పంకజ్ కుమార్ (40) అనే వ్యక్తి ఉంటున్నాడు. బుధవారం నాడు అతడు ఓ బిల్డింగుపై నుంచి జారి కిందపడిపోయాడు. అతడికీ తీవ్రంగా గాయాలు కావడంతో సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స తీసుకుంటూ పంకజ్ ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిలో బిగ్ ట్విస్ట్.. ఆయనపై విష ప్రయోగం? సంచలన ఆరోపణలు..
అతడికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మార్చురీలో పెట్టారు. అదే సమయంలో నంగ్లోయ్ అనే ప్రాంతానికి చెందిన భరత్ భూషణ్ అనే మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం అనంతరం మార్చురీకి తీసుకెళ్లారు. అయితే భరత్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహం కోసం వెళ్లగా వారికి సిబ్బంది పంకజ్ కుమార్ డెడ్‌బాడీని ఇచ్చారు. అప్పుడు చీకటి పడటంతో భూషణ్ కుటుంబం మృతదేహాన్ని చూడకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read: మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదు.. తేల్చిచెప్పిన అమిత్‌షా
ఇక మరుసటి రోజు ఉదయం పంకజ్ కుటుంబీకులు మృతదేహం కోసం వెళ్లగా అతడి డెడ్‌బాడీ ఎక్కడా కనిపించలేదు. వాళ్లు సిబ్బందిని నిలదీయడంతో వారు రికార్డులను పరిశీలించారు. భరత్ భూషణ్ మృతదేహం మార్చురీలోనే ఉన్నట్లు తేలింది. భషణ్ ఫ్యామిలీకి పంకజ్ మృతదేహాన్ని అప్పగించినట్లు స్పష్టమైంది. ఇలా పెద్ద తప్పు జరగడంతో పంకజ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
Also Read: ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి...బాంబుల వర్షం కురిపించిన రష్యా