Israel: పాకిస్థాన్‌ అణు స్థావరాలను నాశనం చేసే ప్రణాళిక.. భారత్‌కు ఇజ్రాయెల్‌ బంపర్ ఆఫర్‌ !

గతంలో ఇజ్రాయెల్‌.. పాకిస్థాన్‌ అణు స్థావరాలపై బాంబులు వేసి కథను ముగించవచ్చని భారత్‌కు ఆఫర్‌ ఇచ్చింది. అప్పట్లో భారత్‌కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ ఆఫర్‌ను చాలావరకు పరిగణించారు. కానీ చివరిక్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయి ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. 

New Update
Israel Offers India to Strike on pakistan Nuclear base

Israel Offers India to Strike on pakistan Nuclear base

భారత్‌, పాకిస్థాన్ మధ్య ఇప్పటిదాకా మూడుసార్లు యుద్ధాలు జరిగాయి. భారత్‌తో సహా పాక్‌ కూడా ఇప్పటికే అణ్వాయుధాలను కలిగి ఉంది. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మీటింగ్‌లో ఉగ్రవాదం గురించి ఇజ్రాయెల్‌ పాక్‌కు చెప్పిన విధానం 1980 నాటి పరిస్థితులను గుర్తుచేసింది. గతంలో ఇజ్రాయెల్‌.. పాకిస్థాన్‌ అణు స్థావరాలపై బాంబులు వేసి కథను ముగించవచ్చని భారత్‌కు ఆఫర్‌ ఇచ్చింది. అప్పట్లో భారత్‌కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ ఆఫర్‌ను చాలావరకు పరిగణించారు. కానీ చివరిక్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయి ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. 

Also Read: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆడ్రియన్ లెవీ,  కేథరీన్ స్కాట్-క్లార్క్ రాసిన డిసెప్షన్ అనే పుస్తకంలో ఈ అంశం గురించి ప్రస్తావించారు. 1980 ప్రారంభంలో పాకిస్థాన్ అణుకార్యక్రమాన్ని ఇజ్రాయెల్‌ ముప్పుగా భావించింది. ఈ క్రమంలోనే 1984లో భారత్‌కు ఉమ్మడి ఆపరేషన్‌ను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌కు చెందిన F-16, F-15 యుద్ధ విమానాలు భారత్‌లో జామ్‌నగర్‌ వైమానిక స్థావరంలో ఇంధనం నింపాలి. అక్కడి నుంచి పాకిస్థాన్‌లోని కహుతా అణు కేంద్రంపై బాంబు దాడి చేసి దాన్ని పూర్తిగా నాశనం చేయాలనేది ప్లాన్. ఇజ్రాయెల్‌ ప్రతిపాదించిన ఈ ఆఫర్‌ను అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ముందుగా అంగీకరించింది. కానీ అంతర్జాతీయ ఒత్తిడి వల్ల.. అలాగే అమెరికా, పాకిస్థాన్‌తో యుద్ధం జరిగే ఛాన్స్ ఉందనే భయంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.  

Also read: సమానత్వం ఉంటే ఎందుకు మతం మారుతారు.. సీఎం సంచలన కామెంట్స్

1981లో ఇరాక్‌లోని ఒసిరాక్‌ అణు రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసంది. అలాగే పాకిస్థాన్‌పై కూడా భారత్ ఇలానే దాడి చేయాలని ఇజ్రాయెల్ భావించింది. కానీ ఇది కూడా కుదరలేదు. ఇక చివరికి 1984లో ఇందిరాగాంధి హత్యకు గురయ్యారు. ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ ప్లాన్‌ను పూర్తిగా ఆపేశారు. 

Also read: భర్త ట్రిపుల్ తలాక్.. కోర్టు ముందే భర్తను చెప్పుతో చితకబాదిన భార్య: వీడియో వైరల్

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందనే విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రస్తావించడం ఇదే మొదటిసారి. పాక్‌ నియంత జియాఉల్‌ హక్‌ నాయకత్వంలో అణు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ శక్తులను కూడా చాలాసార్లు హెచ్చరించింది. ఈ క్రమంలోనే 1979లో బ్రిటిషన్ ప్రధానమంత్రి మార్గరెట్‌ థాచర్‌కు కూడా ఓ లేఖ రాసింది. ఆ తర్వాత భారత్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పింది. కానీ భారత్‌లో అంతర్గత అశాంతి నెలకొన్న నేపథ్యంలో యుద్ధం చేయాలని కోరుకోలేదు. పాకిస్థాన్‌కు అమెరికా సపోర్ట్ ఉంది. F-16 యుద్ధ విమానాలను కూడా ఆ దేశానికి అందించింది. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడమే మంచిదని భారత్‌ భావించింది.  

Also Read: ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు..భర్త మృతి..భార్య ఏం చేసిందంటే..?

Advertisment
తాజా కథనాలు