/rtv/media/media_files/2025/09/16/modi-credit-cards-2025-09-16-12-02-01.jpg)
Modi Credit cards
చిన్న వ్యాపారుల కోసం ప్రధాని మోదీ ఎన్నో ప్రభుత్వ పథకాలను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చారు. వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల ఎందరో వారి వ్యాపారాలను మెరుగుపరచుకున్నారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మంది వ్యాపారాల కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. ముందుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత కట్టే విధానం బ్యాంకులు అవలంభిస్తున్నాయి. అయితే ఇదే విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే మోదీ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టనున్నారు.
ఇది కూడా చూడండి: Income Tax Returns : ఐటీఆర్ దాఖలు చేయలేదా? త్వరపడండి..ఈ రోజే చివరి అవకాశం!
చిన్న వ్యాపారులకు లాభాలు చేకూర్చాలని..
ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు పరిమితి ఉన్న క్రెడిట్ కార్డును ప్రవేశపెడతామని తెలిపారు. Udyam పోర్టల్‌లో ఎవరైతే నమోదు చేసుకుంటారో వారికి క్రెడిట్ కార్డులు అందజేస్తామని ఆమె చెప్పారు. మొదటి ఏడాదిలో పది లక్షల కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అయితే ఈ మోదీ క్రెడిట్ కార్డును అందరికీ కాదు.. కొందరికి మాత్రమే ఇస్తారు. దేశంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్న వారికి ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డుల వల్ల వ్యాపారులకు ఎన్నో లాభాలు చేకూరనున్నాయి.
ఇది కూడా చూడండి: IT Returns: ఐటీ రిటర్న్ గడువు పెరిగినా..వెబ్ సైట్ పని చేయక తిప్పలు..
వ్యాపారం చేసుకునేందుకు చేతిలో డబ్బులు లేకపోయినా కూడా క్రెడిట్ కార్డు సాయంతో వ్యాపారం ప్రారంభించవచ్చు. లాభాలు వచ్చిన తర్వాత మీరు డబ్బు తిరిగి కట్టవచ్చు. అయితే ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఎలాంటి వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం ఇస్తారు. అలాగే ఈ కార్డుతో టర్మ్ లోన్లు కూడా తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత 45 నుంచి 50 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత మీరు కట్టే దాని బట్టి వడ్డీ నిర్ణయిస్తారు. అలాగే తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డుల కోసం మోదీ ప్రభుత్వం కొన్ని బ్యాంకులతో అనుసంధానమైనట్లు తెలుస్తోంది.