Warning To Israel: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడిపై ఇస్లాం దేశాల సీరియస్.. రక్త దాహాన్ని అడ్డుకోవాలని తీర్మానం

ఇజ్రాయెల్ పై ఇస్లాం దేశాలన్నీ మండిపడుతున్నాయి. ఖతార్ లోని దోహాపై ఆ దేశం దాడి చేయడంపై ముస్లిం దేశాలు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాయి. దీంట్లో ఇజ్రాయెల్ రక్త దాహాన్ని అడ్డుకోవాలని..ఇకపై దాడులు చేస్తే ఒప్పుకునేదే లేదని తీర్మానించాయి.

New Update
Qatar summit

Qatar summit

ఇజ్రాయెల్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అరబ్, ముస్తిం దేశాలు తీర్మానించాయి. ఖతార్ లోని హమాస్ లీడర్లే లక్ష్యంగా ఐడీఎఫ్ చేసిన దాడిపై ఇస్లాం దేశాలు మండిపడుతున్నాయి. దీనిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అన్ని దేశాలూ తీర్మానించాయి. ఇజ్రాయెల్ రక్త దాహాన్ని అడ్డుకుందామంటూ..అరబ్‌ - ముస్లిం దేశాలకు ఖతార్ అధినేత షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌-థాని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి అరబ్‌ - ముస్లిం దేశాల ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది. సౌదీ అరేబియా, తుర్కియే, కువైట్, ఇరాన్, ఇరాక్, ఈజిప్టు, ఇండోనేసియా, మలేసియా సహా 50కి పైగా దేశాల అధినేతలు, మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ చేష్టలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయని అన్ని దేశాల నేతలూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని నొక్కి చెప్పారు. ఈ మీటింగ్ లో అరబ్, ముస్లిం దేశాలు కలిసి తీర్మానం చేశాయి.

ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా..

ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది. దానికి తోడు ప్రాంతీయ శాంతికి దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని ఇస్లాం దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇకపై తమలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా...అందరిపై దాడి జరిగినట్లుగా భావిస్తామని తీర్మానం చేశాయి. ఈ మీటింగ్ లో అన్ని దేశాల ఖతార్ కు పూర్తి సంఘాభావం తెలిపాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, ఈజిప్ట్, అమెరికాలకు మద్దతుగా నిలిచాయి. ఇక మీటద అన్ని అరబ్, ఇస్లామిక్ దేశాలూ ఐక్యం ఉండాలని నిర్ణయించాయి. జెరూసలెం రాజధానిగా 1967 సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా దేశానికి మరోసారి మద్దతును పునరుద్ఘాటించాయి. దాంతో పాటూ ఇజ్రాయెల్ తో ఉన్న అన్ని సంబంధాలపై పున: సమీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాయి.

Also Read: India-US Trade War: వాణిజ్య చర్చలకు సై.. ఢిల్లీకి అమెరికా ప్రతినిధుల బృందం

Advertisment
తాజా కథనాలు