/rtv/media/media_files/2025/09/16/assam-corrupt-official-nupul-bora-2025-09-16-13-37-10.jpg)
Assam corrupt official Nupul Bora
Nupur Bora : లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూ కూడా ప్రభుత్వ అధికారులు లంచావతారం ఎత్తుతున్నారు. అవినీతికి పాల్పడి కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపూర్ బోరా పోలీసులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంటిలో తనిఖీలు నిర్వహించగా కిలోల కొద్దీ బంగారం, లక్షలు విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మెషిన్లతో లెక్కిస్తున్న దృశ్యాలు బయటకు రావడం సంచలనంగా మారింది. గోలాఘట్‌కు చెందిన నుపుర్ బోరా.. 2019లో అస్సాం సివిల్స్ సర్వీస్‌కు ఎన్నికయ్యారు. కేవలం 28 ఏండ్ల వయసులోనే ఆమె భారీ అవినీతికి పాల్పడినట్లు తేలింది.
ఆమె మీద వచ్చిన ఆరోపణలతో చీఫ్‌మినిస్టర్ స్పెషల్ విజిలెన్స్ సెల్ బృందం గువాహతిలోని నుపూర్ బోరా నివాసంలో తనిఖీలు నిర్వహించింది. అయితే సంబంధిత అధికారులు వెల్లడించిన ప్రకారం రూ.92 లక్షలు విలువ చేసే నగదు, కోటి రూపాయల విలువ చేసే నగలను సీజ్ చేశామని అధికారికంగా ప్రకటించారు. దానితో పాటు బార్‌పేటలో ఉన్న ఆమెకు చెందిన అద్దె నివాసం నుంచి మరో రూ.10 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆపై ఆమెను అరెస్ట్ చేసి ఆమె అవినీతి మీద వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రశ్నిస్తున్నట్లు ప్రకటించారు.
నుపుర్ బోరా ప్రస్తుతం గోరోయిమరి జిల్లా కంరూప్‌లో సర్కిల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిస్తోంది. బోరా తన పదవికాలంలో హిందూ భూములను 'సందేహాస్పద వ్యక్తులకు' డబ్బు కోసం బదిలీ చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఆమెపై వస్తున్న భూ సంబంధిత ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా నిఘా ఉంచినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బార్‌పేట రెవెన్యూ సర్కిల్‌లో ఆమె విధులు నిర్వహించిన సమయంలో లంచం తీసుకుని హిందూ ఆలయాల భూములను ఇతరుల పేరిట బదిలీ చేసినట్లు అభియోగాలు ఉన్నాయని తెలిపారు. మైనారిటీల జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై రైడ్ జరగడం తీవ్ర దుమారం చెలరేగింది.
ఈ క్రమంలోనే సీఎం ప్రత్యేకంగా ఆమె మీద రైడ్ చేయించినట్లు తెలుస్తోంది. నుపూర్ తో పాటు ఆమె సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురజిత్ డేకాని కూడా అధికారులు విచారిస్తున్నారు. ఆయన బార్‌పేట జిల్లాలో అనేక భూములు అక్రమంగా సంపాందించినట్లు ఆరోపణలు వచ్చాయి. నుపూర్ కేసులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క.. కేఎంఎస్‌ఎస్(Krishak Mukti Sangram Samiti) అనే స్థానిక ఉద్యమ సంస్థ కూడా ఆమె అవినీతి పై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
అస్సాంలో అవినీతి రహిత పాలన అందిస్తానంటూ సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్‌ను 2021లో హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు.అధికారుల అక్రమ ఆస్తులపై దాడులు, అవినీతి సంబంధిత కేసుల విచారణ, సున్నితమైన భూమి బదిలీ వ్యవహారాలపై నిఘా.. తదితర అంశాలను ఈ విభాగం పర్యవేక్షిస్తోంది.
ఇది కూడా చూడండి:Hyderabad: కొంప ముంచిన ఇన్‌స్టాగ్రామ్.. ఆ రీల్ చూసి ఫాలో అవుతే ఏం జరిగిందంటే..