Olympics: కేంద్రం గుడ్న్యూస్.. వాళ్లకు నెలకు రూ.50 వేల ఆర్థిక సాయం
2036లో ఒలింపిక్స్ క్రీడలు భారత్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒలింపిక్స్లో పతకాలు గెలవగలిగే 3 వేల మంది ప్రతిభావంతుల్ని గుర్తిస్తామని తెలిపారు. వాళ్లను నెలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.