ఇండియా-పాక్ సీజ్‌ఫైర్ ట్రంప్ సుంకాలకు మధ్య లింక్?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

ఇండియా, పాక్ కాల్పుల విరమణకు ట్రంప్ సుంకాల పెంపుకు లింక్ ఉందంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇండియా-పాక్ కాల్పుల విరమణ క్రెడిట్ ఇవ్వలేదనే భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నాడని అంటున్నారు.

New Update
Trump

Trump

ఇండియా, పాక్ కాల్పుల విరమణకు ట్రంప్ సుంకాల పెంపుకు లింక్ ఉందంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై చేసిన విమర్శలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు 50 శాతం టారిఫ్‌కు కూడా విధిస్తామని ప్రకటించాడు. దీనికి కారణం భారత్ రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొంటుందని.. అది పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్లు అని ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ అసలు కారణం వేరే ఉంది.

ఇండియా, పాక్ కాల్పుల విరమణలో ట్రంప్‌కు క్రెడిట్ ఇవ్వలేదనే భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ కక్ష్య పెంచుకున్నాడు. ఇజ్రాయెల్, ఇరాన్, అలాగే ఇటీవల కాలంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ విషయంలో తాను మధ్యవర్తిత్వం వహించానని, ఆ క్రెడిట్ తమకు దక్కడం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో కూడా తన ప్రమేయం ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో మూడో పార్టీ ప్రమేయం లేదని, అది కేవలం ఇరు దేశాల చర్చల ఫలితమేనని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే, ట్రంప్ తన వ్యాఖ్యలను పదే పదే పునరుద్ఘాటించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తన ప్రాధాన్యతను చాటుకోవాలని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని వెనుక ఆయనకు 'నోబెల్ శాంతి బహుమతి' ఆకాంక్ష కూడా ఉండవచ్చని చెబుతున్నారు. ఈ విషయంపై భారత్ ప్రభుత్వం స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

అంతేకాకుండా, ఇటీవల కాలంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా ట్రంప్ భారత్పై సుంకాలు విధించడం, దీనిపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించడం వంటి చర్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ తన సార్వభౌమ అధికారాన్ని సమర్థించుకుంది. అమెరికాలోని పలువురు రాజకీయ నేతలు కూడా ట్రంప్ చర్యలను విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలు భారతదేశంతో వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీస్తాయని రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ వంటివారు హెచ్చరించారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ కీలక స్థానాన్ని, అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త సవాళ్లను సూచిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు