Racist Attack: ఐర్లాండ్ లో మితిమీరిన జాత్యాహంకారం..ఆరేళ్ల ఇండియన్ బాలిక ప్రైవేట్ పార్ట్ లపై దాడి

ఐర్లాండ్ లో గత కొంతకాలంగా భారతీయులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గో టూ బ్యాక్ ఇండియా అంటూ దారుణంగా హింసిస్తున్నారు. తాజాగా ఓ ఆరేళ్ల అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ పై సైకిల్ తో కొట్టారు కొంతమంది అబ్బాయిలు.

New Update
Iraland

attack on six years girl in Irland

ఐర్లాండ్ లో చిన్న పిల్లల దగ్గర నుంచీ పెద్ద వాళ్ళ వరకూ జాత్యాహంకారం మితిమీరిపోతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ వరుసపెట్టి భారతీయులపై దాడులు చేస్తున్నారు. తమ దేశం నుంచి వెళ్ళిపోవాలి అంటూ తిట్టడమే కాక.. ఇష్టం వచ్చినట్లు అటాక్ చేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం ఇలాంటి పనులు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో ఐర్లాండ్ లో భారతీయులు ఉండాలంటే భయపడే స్థితి వస్తోంది.

ముఖం మీద పిడిగుద్దులు..సైకిల్ తో దాడి..

రీసెంట్ గా ఆగస్టు 4న జరిగిన ఓ సంఘటనపై ఐర్లాండ్ లోని భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ఫోర్ట్ అనే ప్రదేశంలో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలిక మీద కొంత మంది అబ్బాయిలు గో బ్యాక్ టూ ఇండియా అంటూ దాడి చేశారు. సైకిల్ తో పాప ప్రైవేట్ పార్ట్ మీద కొట్టారు. ముఖం మీద పిడిగుద్దులు కురిపించారు.  దాంతో పాటూ నోటికి వచ్చినట్టు తిట్టారని తెలుస్తోంది. ఎఫ్ పదం వాడడంతో పాటూ...డర్టీ ఇండియా, ఇండియాకు తిరిగి వెళ్ళిపో అంటూ మాట్లాడారు. ఇదంతా చేసిన కుర్రాళ్ళ వయసు కూడా అంత ఎక్కువ ఏమీ కాదు. వారందరూ 12 నుంచి 14 ఏళ్ళలోపు వారే ఉంటారని బాలిక తల్లి చెబుతున్నారు. తన కళ్ళ ఎదురుగానే పాప మీద దాడి చేశారని ఆమె చెబుతున్నారు. 

బాలిక తల్లి ఐర్లాండ్ లో ఓ ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తున్నారు. వీరికి ఐరిష్ పౌరసత్వం కూడా ఉంది.  ఈ సంఘటన తర్వాత తన కూతురు చాలా భయపడిందని.. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతోందని ఆమె తెలిపారు. ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని..ఇప్పుడు ఐర్లాండ్ లో ఉండాలంటే కూడా భయంగా ఉందని పాప తల్లి అంటున్నారు. అయితే ఆ అబ్బాయిలకు శిక్ష పడాలని తాను కోరుకోవడం లేదని...వారిని కౌన్సెలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను చెప్పారు. ఐర్లాండ్ లోకి తాము అక్రమంగా ప్రవేశించలేదని...తమకు అన్ని అర్హతలున్నాయని చెబుతున్నారు. గతనెలలో డబ్లిన్ శివారు ప్రాంతమైన టాలాగ్ట్‌లో ఒక టీనేజర్ ముఠా 40 ఏళ్ల భారతీయుడిపై దారుణంగా దాడి చేయడమే కాక బట్టలు విప్పి హింసించారు. 

Also Read: Gun Firing: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం..ఈసారి ఏకంగా సైనిక స్థావరంలోనే..

Advertisment
తాజా కథనాలు