India- Pakistan: భారత్‌, పాక్‌ల మధ్య కీలక సమావేశం.. ఎందుకంటే ?

ఇటీవల పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు మధ్య శుక్రవారం కీలక సమావేశం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
India, Pakistan to hold flag meeting

India, Pakistan to hold flag meeting

India- Pakistan: ఇటీవల పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు(Military officers) శుక్రవారం సమావేశమైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌(Poonch sector)లో గురువారం నియంత్రణ రేఖ వెంట (LOC) ఉగ్ర కదలికలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.   

Also Read: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృ‌తి

పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు..

ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఇరుదేశాల మధ్య సైన్యాధికారులతో శుక్రవారం అక్కడ ఫ్లాగ్‌ సమావేశం జరగనుందని భారత సైన్యానికి చెందిన ఓ అధికారి చెప్పారు. మరోవైపు చూసుకుంటే గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడతోంది. గత వారమే ఘాటి సెక్టార్‌(Ghati Sector)లో పాకిస్థాన్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ దాడులపై అప్రమత్తమైన భారత బలగాలు పాక్‌ సైన్యాన్ని తిప్పికొట్టాయి. 

Also Read: సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మహిళలకు 60 రోజుల పాటు సెలవులు

కానీ దీనివల్ల కాల్పల విరమణ ఒప్పందం ఉల్లంఘన కాలేదని భారత సైన్యాధికారులు(Indian Army officers) చెప్పారు. ఇక ఫిబ్రవరి 4,5 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో కొందరు చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం వాళ్లపై కాల్పులు జరిపింది. ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. అనంతరం పలుమార్లు జరిగిన ఉగ్రకాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. అయితే తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంపై పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: ట్రంప్‌ ఎఫెక్ట్‌ ...నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!

Also Read: Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు