Women Employees: సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మహిళలకు 60 రోజుల పాటు సెలవులు

పురిట్లో బిడ్డను కోల్పోయిన మహిళా ఉద్యోగులకు 60 రోజుల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవ మాసాలు మోసిన తర్వాత బిడ్డ పురిట్లోనే చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Maternity Leaves

Maternity Leaves Photograph: (Maternity Leaves)

తల్లి కావడమనేది మహిళలకు ఒక ప్రత్యేకమైన వరం. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తల్లి తన మాతృత్వాన్ని వదులుకోదు. ఒక నెల లేదా రెండు నెలలకే అనుకోని కారణాల వల్ల గర్భస్రావం అయితే ఆ తల్లి బాధ చెప్పలేం. అలాంటిది నవ మాసాలు మోసిన తర్వాత పురిట్లో బిడ్డ చనిపోతే.. ఆ తల్లి బాధ తీర్చడం ఎవరి తరం కూడా కాదు. అయితే ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి:Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు..

సాధారణంగా మహిళలకు ప్రసూతి సెలవులు ఉంటాయి. కానీ పురిటిలోని బిడ్డను కోల్పోయిన తల్లులకు ప్రసూతి సెలవులు వర్తించవు. వీరు ఎంతో బాధను దిగమింగుకుని.. ఉద్యోగాలు చేస్తుంటారు. ఇలాంటి మహిళలను స్ట్రాంగ్ చేసేందుకు హిమాచల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురిట్లో బిడ్డను కోల్పోయిన తల్లులకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. డెలివరీ అయిన మహిళలకు ప్రస్తుతం ప్రసూతి సెలవులు 180 రోజులు ఇవ్వనున్నాయి.

ఇది కూడా చూడండి:Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్‌ గా ముందుకు దూసుకుపోండి!

ప్రసవంలో లేదా తర్వాత బిడ్డను కోల్పోయిన తల్లులకు  60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బిడ్డను కోల్పోయిన తల్లి మానసికంగా ఎంతో ఆవేదన చెందుతుంది. సాధారణంగా డెలివరీ తర్వాత కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తారు. దీనికి తోడు నవ మాసాలు మోసిన బిడ్డ పురిట్లోనే చనిపోతే తల్లి మానసికంగా, శారీరకంగా ఎఫెక్ట్ అవుతుంది. దీంతో వారు ఉద్యోగంపై కూడా ఇంట్రెస్ట్ చూపించలేరు. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు హిమాచల్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Advertisment
తాజా కథనాలు