Watch Video: కన్నడ మాట్లాడలేదని ఐఏఎఫ్‌ అధికారిపై దాడి.. వీడియోలో రక్తంతో..

కన్నడ భాష మాట్లాడలేదని ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (IAF) అధికారి షీలాదిత్యా బోస్‌పై ఓ దుండగుడు దాడి చేయడం కలకలం రేపింది. గాయాలతో రక్తం వస్తుండగానే ఆ ఐఏఎఫ్ అధికారి వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
IAF officer, wife brutally attacked in Bengalur, shares bloodied face

IAF officer, wife brutally attacked in Bengalur, shares bloodied face

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. కన్నడ భాష మాట్లాడలేదని ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (IAF) అధికారి షీలాదిత్యా బోస్‌పై ఓ దుండగుడు దాడి చేయడం కలకలం రేపింది. గాయాలతోనే ఆ ఐఏఎఫ్ అధికారి వీడియో రిలీజ్ చేశారు. మోహంపై రక్తం వస్తుండగానే తనపై జరిగిన దాడి గురించి వివరించారు. '' ఈరోజు ఉదయం నేను, నా భార్య ఎయిర్‌పోర్టుకి కారులో వెళ్తున్నాం. 

Also Read: దేశంలో ఐఐటీ విలేజ్.. 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ క్వాలిఫై

Also Read :  హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థుల పాడుపని.. మత్తు కోసం ఇంక్షన్లు, ట్యాబ్లెట్లు - ఒకరు మృతి

IAF Officer Brutally Attacked In Bengalore

అకస్మాత్తుగా ఓ బైక్‌ మా వెనకాలే వచ్చింది. ఆ తర్వాత మాకు అడ్డుతగిలింది. బైక్‌పై వచ్చిన ఆ వ్యక్తి నన్ను కన్నడలో తిట్టడం మొదలుపెట్టాడు. నా కారుపై DRDO స్టిక్కర్ ఉండటాన్ని చూసి కన్నడలో ఏవేవో మాట్లాడాడు. చివరికి నా భార్యను కూడా తిట్టాడు. నా భార్యను తిట్టడాన్ని చూసి నేను తట్టుకోలేకపోయా. కారు నుంచి నేను బయటకు దిగే సమయంలో అతడు నా నుదిటిపై బైక్‌ కీ తో దాడి చేశాడు. రక్తం వచ్చింది. ఆర్మీలో పనిచేసే వాళ్లతో ఇలానే వ్యవహరిస్తారా అని నేను అతడ్ని అడిగాను. అక్కడికి చాలామంది వచ్చారు. కానీ వాళ్లు కూడా మమ్మల్ని తిట్టడం ప్రారంభించారు. అనంతరం ఆ వ్యక్తి ఒక రాయిని తీసుకొని నా కారుపై దాడి చేసేందుకు యత్నించాడు. 

Also Read: పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఇదే.. నైట్‌పబ్ బౌన్సర్ నుంచి పోప్‌గా!!

నేను అతడిని ఆపేందుకు యత్నించగా.. మళ్లీ అతడు నా తలపై కొట్టాడు. చివరికి మాకు జరిగిన ఘటనపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు. కర్ణాటక పరిస్థితి ఇలా తయారైంది. కన్నడిగుల ఆశయాన్ని నేను నమ్ముతాను. కానీ కర్ణాటక హార్ట్‌ల్యాండ్‌లో వాస్తవాన్ని చూశాక దీన్ని నమ్మలేకపోతున్నానని'' ఆ ఐఏఎఫ్ అధికారి షీలాదిత్య బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తనపై దాడి చేసిన వ్యక్తి ఎలా ఉంటాడో కూడా బయటపెట్టాడు. అతడ్ని పట్టుకోవాలని ప్రజలను కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆయనకు సపోర్ట్‌ చేస్తూ కామెంట్లు చేశారు. చివరికి ఐఏఎఫ్‌ అధికారిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ దుండగుడు ఐఏఎఫ్‌ అధికారిపై ఎందుకు దాడి చేశాడనే దానిపై క్లారిటీ లేదు.

Also Read :  మాయ లేడీ.. అండర్‌వేర్స్ ఎలా చోరీ చేసిందో చూశారా? - ‘కి’లేడీ మామూల్ది కాదు భయ్యా!

 

telugu-news | rtv-news | indian-air-force | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | bengalore | karnataka

Advertisment
Advertisment
తాజా కథనాలు