VIRAL VIDEO: మాయ లేడీ.. అండర్‌వేర్స్ ఎలా చోరీ చేసిందో చూశారా? - ‘కి’లేడీ మామూల్ది కాదు భయ్యా!

సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఓ మహిళ అండర్‌వేర్స్ చోరీ చేస్తూ పట్టుబడిన వీడియో చక్కర్లు కొడుతోంది. కౌంటర్ వద్ద చెక్ చేయగా.. దాదాపు 5 అండర్ వేర్స్ చోరీ చేసినట్లు కనిపించింది.

New Update
VIRAL VIDEO (1)

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచం నలు మూలల్లో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే కళ్ల ముందుకు వచ్చేస్తుంది. అందులో ఎన్నో ఊహించని సంఘటనలు, మరెన్నో హఠాత్తు పరిణామాలు, ఇంకెన్నో నమ్మలేని విజువల్స్, కడుపుబ్బా నవ్వించే క్లిప్స్.. ఇలా చాలా వరకు సోషల్ మీడియాలో తరచూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

ముఖ్యంగా ఫన్నీ క్లిప్స్ తెగ వైరల్‌ అవుతుంటాయి. ఎక్కువ మంది ఇలాంటి ఫన్నీ వీడియోలనే చూసేందుక ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ఫన్నీ పరిణామమే చోటుచేసుకుంది. ఓ మహిళ చేసిన పనికి సోషల్ మీడియా నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఓ షాపింగ్‌ మాల్‌కి వెళ్లిన ఒక మహిళ ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

అండర్‌వేర్స్ చోరీ

దాదాపు 30 - 40 ఏళ్ల మధ్య ఉన్న ఒక మహిళ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. అందులో మొత్తం తిరిగి కొన్ని బట్టలు, లోదుస్తులను చూసింది. వాటిని తీసుకుని ట్రైల్ రూమ్‌కి వెళ్లింది. తిరిగి వచ్చి వాటిని పడేసింది. కానీ తీసుకెళ్లిన బట్టల్లో అండర్‌వేర్స్ మాత్రం తిరిగి తీసుకురాలేదు. వాటిని ఒకటి తర్వాత మరొకటి.. ఇలా దాదాపు 5 అండర్ వేర్స్ ధరించేసింది. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

అది గమనించిన షాపింగ్ మాల్ స్టాఫ్ ఆమెను కౌంటర్ దగ్గర పట్టుకున్నారు. మొత్తం చెక్ చేసి అండర్‌వేర్స్ చోరీని బయటపెట్టారు. ఆ మహిళ ధరించిన 5 అండర్‌వేర్‌లను గుర్తించారు. ఆపై ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను సైతం చెక్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.  

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు