Social Media : రీల్స్‌ కోసం ఎంతకు తెగించార్రా... ఏకంగా రైలు పట్టాలపై పడుకొని...

ఒడిశాలోని బౌధ్ జిల్లాలో పురునపాణి స్టేషన్ సమీపంలోని దలుపాలిలో ఓ బాలుడు రీల్స్‌కోసం తన ప్రాణాల్ని రిస్క్ లో పెట్టాడు. ఈ వీడియోలో ఒక బాలుడు పట్టాలపై పడుకుని అత్యంత ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. ఎదురుగా రైలు వస్తుండగా ఆ బాలుడు రైలు పట్టాలపై పడుకున్నాడు.

New Update
Lying on the train tracks for reels..

Lying on the train tracks for reels..

సోషల్‌ మీడియా ధోరణి వెర్రితలలు వేస్తోంది. రీల్స్ మోజులో పడి తాము ఏం చేస్తున్నామో అనే కనీస విచక్షణ కూడా లేకుండా జనాలు ప్రవర్తిస్తున్నారు. దీంతో చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వయసు, ఆడ, మగ అనే తేడా లేకుండా సోషల్ మీడియా వైరస్ ఒక మత్తులా పట్టి పీడిస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి కొంతమంది తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

Also Read:చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

Social Media Reels On Railway Track

రీల్స్ వైరస్ మానియా వారి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడవేస్తుందో  చెప్పే మరో తాజా ఉదాహరణ చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. ఒడిశాలోని బౌధ్ జిల్లాలో పురునపాణి స్టేషన్ సమీపంలోని దలుపాలిలో ఓ బాలుడు రీల్స్‌ కోసం తన ప్రాణాల్ని రిస్క్ లో పెట్టాడు. ఈ వీడియోలో ఒక బాలుడు పట్టాలపై పడుకుని అత్యంత ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. ఎదురుగా రైలు వస్తుండగా ఒక బాలుడు రైలు పట్టాలపై పడుకున్నాడు. దీన్ని అతని స్నేహితులలో ఒకరు డైరెక్ట్‌ చేయగా, మరొకరు వీడియో తీశాడు. ఆ బాలుడు రైలు వెళ్లేంత వరకు పట్టాల మధ్యలోనే పడుకున్నాడు. ఈ స్టంట్‌ను చూస్తున్న వారు చప్పట్లతో కేరింతలు కొట్టారు. రైలు వెళ్లి పోయాక బాలుడు లేచి నిలబడి ఫోటోలకు పోజు ఇచ్చాడు. స్నేహితులు ఆనందంతో కేకలు వేస్తూ అభినందించారు. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు  ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Also Read:  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

కాగా, అయితే ట్రాక్‌పై పడుకున్న బాలుడు స్పందించాడు. ఇలా చేస్తే  ఈ రీల్ వైరల్ అవుతుందని తన స్నేహితులు ఈ  చెప్పారని,  ​ట్రాక్‌పై ఉండగా, మీదనుంచి రైలు వెళుతున్నపుడు, గుండె వేగంగా కొట్టుకుందని,  బ్రతుకుతానని ఊహించలేదంటూ  చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఘటన పై ఆవేదన వ్యక్తం  చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ  సజ్జనార్‌ ఎక్స్‌ లో పోస్ట్‌ పెట్టారు.  దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో రీల్స్‌ పిచ్చి ఎంత ప్రమాదకరమో సజ్జనార్‌ హెచ్చరించారు. పిల్లల వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని,భద్రతా చట్టాలను ఉల్లంఘన అని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో తమ పిల్లల వ్యవహారాన్ని ఒక  కంట కని పెట్టాలని తల్లిదండ్రులను కోరారు.

Also Read:  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

Also Read :  బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

Social media viral video | social media reels | social media bad effect | odisha-police | odisha-news | odisha | in-odisha | Insta Reels | dangerous reels location | avoid doing reels in public | reels

Advertisment
Advertisment
తాజా కథనాలు