/rtv/media/media_files/2025/07/17/honeytrap-scandal-rocks-maharashtra-2025-07-17-16-01-41.jpg)
Honeytrap scandal rocks Maharashtra
మహారాష్ట్రలో 72 మంది సీనియర్ అధికారులు, మాజీ మంత్రులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని ఒక రాజకీయ నాయకుడు ఆరోపించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నాయకుడు నాసిక్‌ను సందర్శించిన సమయంలో విలేకరులతో అనధికారికంగా మాట్లాడిన సందర్భంగా ఈ ఆరోపణ చేయడం సంచలనంగా మారింది. ఆ తర్వాత నాకా పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదుతో ఇది నిజమేనని తేలింది. ఈ కేసులో నాసిక్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా ఉన్నారు, అయితే ఈ కేసుకు సంబంధించిన వీడియోలు హనీ ట్రాప్‌కు నిజమైన సాక్ష్యమా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నాసిక్‌లోని ముంబై నాకా పోలీస్ స్టేషన్‌లో ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన సంఘటనలపై దాఖలైన ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : కేటీఆర్, కవితపై CIDకి ఫిర్యాదు
Maharashtra Honeytrap Scandal
నాసిక్, ముంబై, పూణే, థానే వంటి నగరాల్లో ఒక మహిళ అధికారులను బ్లాక్‌మెయిల్ చేయడానికి తప్పుడు అత్యాచార ఆరోపణలు, రహాస్య కెమెరాలను ఉపయోగించిందని తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించడానికి ఏ ఒక్క అధికారి ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది. కాగా ఈ కేసులో నాసిక్, ముంబై, పూణే కు చెందిన పలువురు అధికారులు, నాయకులు ఇందులో పాల్గొన్నారని ప్రాథమిక నివేదికలో వెల్లడయ్యాయి. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ హనీ ట్రాప్ వెనుక నాసిక్‌లోని ఒక ప్రముఖ రాజకీయ పార్టీ మాజీ ఆఫీస్ బేరర్ సూత్రధారి గా ఉన్నట్లు గుర్తించారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు దీనిపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దీనిపై థానే జిల్లా పోలీసులకు మూడు, నాసిక్‌లో ఒకటి ఫిర్యాదులు అందాయి.
ఇది కూడా చదవండి:పాపం అమాయకపు దొంగ.. దొంగతనానికి వెళ్లి..
ఈ ఆరోపణల్లో ఏడుగురు క్లాస్ వన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, పౌర సేవకులు, మాజీ మంత్రులు నిందితులుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ఫిర్యాదులలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి, హనీ ట్రాప్ చేసిన వ్యక్తి ఒక సీనియర్ అధికారి నుండి మూడు కోట్లు డిమాండ్ చేశాడని, ఫలితంగా ఆ అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఆ అధికారి భార్య వీడియో రూపంలో ఆధారాలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Also Read : మావోయిస్టులకు మరో బిగ్ షాక్...జన నాట్యమండలి ఫౌండర్ సంజీవ్ లొంగుబాటు
కాగా, ఈ విషయంలో అధికారులు రహాస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారులు విచారణ సమయంలో పేరు వెల్లడించకూడదని అభ్యర్థించడం మూలంగానే వారు పేర్లు వెల్లడించడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా, నిందితులైన మంత్రులు ఉత్తర మహారాష్ట్రకు చెందినవారని, వారి పేర్లు ఫిర్యాదులలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, పోలీసులు ఈ పేర్లను వెల్లడించకపోవడంతో ఈ విషయమై విస్తృతమైన ఊహాగానాలు చెలరేగాయి. ఈ సంఘటన పై విచారణ కొనసాగుతున్న కొద్దీ రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read : బీహార్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. పెరోల్ ఖైదీ మృతి
honey-trap | sex-scandal | sex-scandal-case | nasik | ministers | officers