Honeymoon Murder: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్‌ కేసులో బిగ్ ట్విస్ట్!

మేఘాలయ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. భర్తను హత్యకు ప్లాన్  చేసిన సోనం అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు తన భర్త రాజా ఫేస్ బుక్ ను వాడుతూ తమ హనీమూన్ ట్రిప్ సజావుగా సాగుతుందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది.

New Update
sonam-raja

sonam-raja

మేఘాలయలో కట్టుకున్న భర్తను హనీమూన్‌కు తీసుకువెళ్లి  మరి  భార్య హత్యకు పాల్పడిన కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఇండొర్ కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ ల పెళ్లి మే11న జరగగా...ఈ జంట మే 20న హనీమూన్ కు మేఘాలయకు వెళ్లింది.  మే 20న, వారిద్దరూ తమ హనీమూన్ కోసం గౌహతి చేరుకున్నారు, అక్కడి నుండి మే 22న షిల్లాంగ్‌కు వెళ్లారు. మే 23న సోహ్రా ప్రాంతంలో రాజా హత్యకు గురయ్యాడు.  తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read :  కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. విష్ణు స్పెషల్ పోస్టర్

అందర్నీ నమ్మించే ప్రయత్నం

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్యకు ప్లాన్  చేసిన సోనం అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు తన భర్త రాజా ఫేస్ బుక్ ను వాడుతూ తమ హనీమూన్ ట్రిప్ సజావుగా సాగుతుందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది.  హనీమూన్ ట్రిప్ ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేస్తూ నమ్మించింది. తాజాగా పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది. రాజా మృతదేహం దాదాపు 10 రోజుల తర్వాత  ఓ లోయలో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోనమ్ ముగ్గురు హంతకులకు మధ్యప్రదేశ్ నుండి మేఘాలయకు ఫోన్ చేసింది. మే 21న, అందరూ గౌహతి చేరుకున్నారు.  మే 23న, సోనమ్ రాజాను ఎవరు లేని ఓ ప్లేస్ కు తీసుకువెళ్లింది.

Also Read :  భారీ కాల్పులు.. 11 మంది విద్యార్థులు మృతి

అక్కడ ముగ్గురు హంతకులు రాజాను పదునైన ఆయుధంతో తలపై రెండుసార్లు కొట్టి చంపారు. నేరం జరిగిన ప్రదేశంలోనే ఉన్న సోనమ్ అంతా కళ్లముందే చూస్తూనే ఉంది. సంఘటనకు 10 కిలోమీటర్ల ముందు సీసీటీవీలో ముగ్గురు నిందితులతో సోనమ్ కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.  హత్య తర్వాత నిందితులంతా 11 కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నారు. హత్య జరిగిన తర్వాత, సోనమ్ మే 23న గువాహటి నుండి రైలులో ఇండోర్ చేరుకుంది, అక్కడ ఆమె తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాను కలిసింది. రాజ్ ఆమెను ఒక రోజు అద్దె గదిలో ఉంచాడు. జూన్ 3, 4 తేదీలలో హత్యలో సోనమ్ ప్రమేయం గురించి పోలీసులకు తెలియడంతో ఘాజీపూర్‌లోని ఒక ధాబాలో అదుపులోకి తీసుకున్నారు.  

Also Read :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Also Read :  మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?

 

Meghalaya Honeymoon Murder Case | Honeymoon Murder Case | Sonam | Raja Raghuvanshi | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు