/rtv/media/media_files/2025/07/20/suicide-2025-07-20-14-50-54.jpg)
Gujarat Couple, 3 Children Found Dead, Relatives Point To EMI Stress
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముగ్గురు పిల్లలకు విషం తాగించి, ఆ తర్వాత వాళ్ల తల్లిదండ్రులు కూడా విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: ఉగ్రదాడికి ఆధారాలేవి.. టెర్రరిస్టులకు పాక్ బహిరంగ మద్ధతు
Also Read : 20 ఏళ్లు కోమాలో ఉన్న సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత
EMI Stress - Family Death
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లోని ధోల్కా ప్రాంతంలో విపుల్ వాఘేలా (32), సోనల్ వాఘేలా (26) ఇద్దరు దంపతులు ఉంటున్నారు. వీళ్లకి కరీనా (11), మయూర్ (8), ప్రిన్సీ(5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే విపుల్ ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చులకే అయిపోవడంతో ఆటో కొనేందుకు తీసుకున్న లోన్‌కు EMI కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది.
Also read: ఒక రాధ ఇద్దరు కృష్ణులు..ఆచారం అంటూ అన్నదమ్ములను పెళ్ళి చేసుకున్న మహిళ
ఆదివారం తెల్లవారుజామునఅతడు తన ముగ్గురు పిల్లలు, భార్యకు విషమిచ్చాడు. తాను కూడా అది తాగడంతో మొత్తం ఐదుగురు బలవర్మణానికి పాల్పడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అయితే విపుల్ కుటుంబం అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu