Medchal Mother : కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

సంచలనంగా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 6పేజీల సూసైడ్‌ నోట్‌ రాసిన తేజస్వీని అనంతరం కొబ్బరి బోండాల కత్తితో  ఇద్దర్ని నరికేయాలని అనుకుంది.  కొడుకులు పారిపోతున్నా సరే వెంటబడి మరి నరికేసింది.

New Update

సంచలనంగా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇద్దరు పిల్లల్ని నరికి చంపి, తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.  

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి హైస్కూల్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన గండ్ర వెంకటేశ్వర్‌ రెడ్డి, తేజస్విని రెడ్డి (35) భార్యాభర్తలు. వీరికి ఆశిష్‌ రెడ్డి(8), హర్షిత్‌ రెడ్డి(6) సంతానం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక తేజస్వినిని, వెంకటేశ్వర్‌ రెండో వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ఈ దంపతులు హైదరాబాద్‌కొచ్చారు. గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్‌లో ఉన్న సహస్ర మహేశ్‌ హైట్స్‌ అపార్టుమెంట్‌లో రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వర్‌ బొంతపల్లి గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌లో క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య తేజస్విని ఇంటివద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. తనతోపాటు పిల్లలు కూడా తరచూ అనారోగ్యానికి గురవుతుండటాన్ని జీర్ణించుకోలేక ఆమె మానసిక పరిస్థితి చాలా దారుణంగా మారింది.

కొబ్బరి బోండాల కత్తితో  

గురువారం సాయంత్రం నాలుగింటికి 6పేజీల సూసైడ్‌ నోట్‌ రాసింది. అనంతరం కొబ్బరి బోండాల కత్తితో  ఇద్దర్ని నరికేయాలని అనుకుంది.  కొడుకులు పారిపోతున్నా సరే వెంటబడి మరి నరికేసింది తేజస్విని. పిల్లల మెడ, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఆశిష్‌ అక్కడికక్కడే మృతిచెందగా... తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హర్షిత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అనంతరం తేజస్విని, అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తన, పిల్లల సమస్యలు గురించి చెబితే ముగ్గురూ చావండంటూ భర్త వెంకటేశ్వర్‌రెడ్డి విసిగించుకోవడంతో తేజస్విని తీవ్ర తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టింది.  వెంకటేశ్వర్‌రెడ్డికి తేజస్విని రెండో భార్య.  కావల్సినంత డబ్బున్నా పిల్లల్ని కాపాడుకోలేకపోయిన తేజస్విని వారి చంపి తాను చనువు చాలించింది.  

Also read :  Viral Video : తండ్రి శవం ముందు లవర్కు తాళి కట్టాడు.. వీడియో వైరల్ !
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు