/rtv/media/media_files/2025/07/17/pm-kisan-amount-status-check-1-2025-07-17-11-36-10.jpg)
PM Kisan amount status check (1)
PM-KISAN : నిరుపేద రైతులకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్(Kisan Samman Nidhi Yojana) పై ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 22వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సహాయం అందుతున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా PM-KISAN చెల్లింపు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చేస్తారు. 21వ విడత(pm kisan samman 22 nd installment date) కు సంబంధించి గత ఏడాది నవంబర్‌లో రైతులకు చెల్లించారు. 22వ విడత చెల్లింపులు ఈ నెల అంటే ఫిబ్రవరి– మార్చి మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 22వ విడత పీఎం కిసాన్ డబ్బులు అందాలంటే రైతులు ఒక కొత్త నిబంధనను తప్పక పాటించాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది.
Also Read : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక మార్పులు..
An Exciting Update On PM Kisan Samman
ప్రభుత్వం తాజాగా, రాబోయే PM-KISAN 22వ విడత కోసం ఫార్మర్ ID (Farmer ID) రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఈ ఫార్మర్ ID అనేది Farmer Registry, AgriStack ఇనిషియేటివ్‌లో ఒక భాగంగా ఉంది. దేశవ్యాప్తంగా రైతుల కోసం ఒక వెరిఫైడ్ నేషనల్ డేటాబేస్ క్రియేట్ చేయడం దీని ఉద్దేశం. ఫార్మర్ ఐడీ లేని రైతులకు 22వ విడత రూ.2,000తో పాటు ముందు ముందు రాబోయే కిసాన్ నిధులు ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా నిలిచిపోవచ్చు. PM-KISAN ప్రయోజనాలు నిజమైన భూమి కలిగిన రైతులకు మాత్రమే అందేలా చేయడం, నకిలీ లబ్ధిదారులను తొలగించాలనే ఉద్దేశంతో ఈ రూల్ ను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఫార్మర్ ID ద్వారా రైతు గుర్తింపు, భూమి రికార్డులు సులభంగా చెక్ చేయవచ్చు. దీంతో సబ్సిడీలు వేగంగా, పారదర్శకంగా సరైన రైతులకు చేరతాయి.
మరో వైపు ఫార్మర్ IDతో పాటు e-KYC తప్పనిసరి నిబంధనగా ఉంది. e-KYC పూర్తి చేయని రైతులకు PM-KISAN 22వ విడత జమ కాదు. ఈ ప్రాసెస్ చేసుకోవడం చాలా ఈజీ. PM-KISAN అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో OTP ద్వారా e-KYC ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని నిమిషాల్లోనే ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. చెల్లింపులు నిలిచిపోకుండా ఉండేందుకు ఈ కేవైసీ చాలా ముఖ్యం. రైతులు ఫార్మర్ ID రిజిస్ట్రేషన్, e-KYC రెండూ పూర్తయ్యాయా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఆధికారిక PM-KISAN(pm-kisan-nidhi-yojana) వెబ్‌సైట్‌లో e-KYC సెక్షన్‌కి వెళ్లి వివరాలు నమోదు చేసి OTP వెరిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాయిదా జమ కాకపోతే లేదా ఆలస్యం అయితే, రైతులు 24 గంటలు అందుబాటులో ఉండే PM-KISAN హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read : భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Follow Us