భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక మార్పులు..

ఇటీవలే పలు కీలక అంశాలతో అమెరికా ఫ్యాక్ట్‌షీట్‌ను రిలీజ్ చేసింది. కానీ కొన్ని గంటల్లోనే అందులో పలు మార్పులు చేసింది. భారత్‌ కొన్ని పప్పు ధాన్యాలపై సుంకాలు తగ్గిస్తుందని ముందుగా చెప్పిన అమెరికా.. తర్వాత ఈ అంశాన్ని ఉపసంహరించుకుంది.

New Update
White House revises fact sheet on India-US trade deal

White House revises fact sheet on India-US trade deal

ఇటీవల భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో దీనిపై తుది సంతకాలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇటీవలే పలు కీలక అంశాలతో అమెరికా ఫ్యాక్ట్‌షీట్‌ను రిలీజ్ చేసింది. కానీ కొన్ని గంటల్లోనే అందులో పలు మార్పులు చేసింది. భారత్‌ కొన్ని పప్పు ధాన్యాలపై సుంకాలు తగ్గిస్తుందని ముందుగా చెప్పిన అమెరికా.. తర్వాత ఈ అంశాన్ని ఉపసంహరించుకుంది. 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లకు భారత్‌ కట్టుబడి ఉంది అనే పదాన్ని  కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఉందనే మార్పులు చేసింది. 

Also Read: భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

భారత్‌కు అమెరికా ఎగుమతి చేసే వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్‌ ముందునుంచే ఒప్పుకోలేదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం వల్ల భారత రైతులు, MSMEకి ఎలాంటి నష్టం లేదని ఇటీవల కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాక్ట్‌షీట్‌లో సవరణలు చేయడం చర్చనీయం అవుతోంది. 

Also Read: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు చేసిన ఎప్‌స్టీన్‌.. కారణం ఇదే !

సోమవారం ట్రంప్‌ యంత్రాంగం ఫ్యాక్ట్‌షీట్‌ను రిలీజ్ చేసింది. కేవలం 24 గంటల్లోనే అందులో సవరణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పలు పదాలు, రూల్స్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మోదీ సర్కార్‌ నుంచి కూడా కొంత ఒత్తిడి ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. తాజాగా చేసిన మార్పుల్లో పప్పు దినుసులు, వ్యవసాయోత్పత్తులపై టారిఫ్‌ల అంశం కీలకంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు