భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రాంతీయ అస్థిరతపై తీసుకుంటున్న చర్యలేమి లేవన్నారు. ప్రపంచం ఏఐ యుగంలోకి వెళ్తోందని.. ఏఐ వల్ల భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదముందని వ్యాఖ్యానించారు.

New Update
Rahul Gandhi's Explosive Speech in Lok Sabha

Rahul Gandhi's Explosive Speech in Lok Sabha

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రాంతీయ అస్థిరతపై తీసుకుంటున్న చర్యలేమి లేవన్నారు. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగంలోకి వెళ్తోందని.. ఏఐ వల్ల భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదముందని వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఏఐ ప్రమాదం ఉందనే వాదనలున్నాయని తెలిపారు. కానీ అమెరికా సూపర్‌ పవర్‌గా ఉండాలంటే వాళ్లకి ఇండియాకు డేటా అవసరమని చెప్పారు.      

Also Read: అమెరికా వైఖరిలో మార్పు.. పప్పుధాన్యాల అంశంపై వెనక్కి!

ఈ డేటాన్ 21వ శతాబ్ధంలో మనల్ని సూపర్‌ పవర్‌గా మారుస్తుందని తెలిపారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో భారత్‌ ట్రేడ్ డీల్ చేసుకుందని.. ఈ ఒప్పందం వెనుక పలు కీలక అంశాలున్నాయని ఆరోపించారు. '' మనం అమెరికాతో సమానం. పాకిస్థాన్‌తో కాదు. అమెరికా కంపెనీలకు ట్యాక్స్‌ హాలిడే ఇచ్చారు. ఇది టెక్స్‌టైల్ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతుంది. ఇంధన భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. భారత్‌ ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలనేది అమెరికా నిర్ణయిస్తోంది. 

Also Read: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు చేసిన ఎప్‌స్టీన్‌.. కారణం ఇదే !

అమెరికాతో జరిగిన ఒప్పందం తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. డాలర్‌ విలువ బలంగా ఉండాలంటే మన డేటా అమెరికాకు చాలా అవసరం. ప్రపంచ దేశాలు యుద్ధాల వైపు వెళ్తున్నాయి. అమెరికా డాలర్‌ ఆధిపత్యాన్ని చైనా, రష్యా ప్రశ్నిస్తున్నాయి. భారత ప్రజలకు ఏ దేశంతోనైనా పోటీ పడే సామర్థ్యం ఉందని'' రాహుల్ గాంధీ అన్నారు. 

Advertisment
తాజా కథనాలు