/rtv/media/media_files/2025/04/21/T1rAUVybKYhBZmZinqi7.jpg)
Gold rate
బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర పన్నులతో కలిపి ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అంచర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం సోమవారం 3,405 డాలర్లకు చేరింది.
Also Read: దేశంలో ఐఐటీ విలేజ్.. 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై
Gold Rates Crossed 1Lakh Mark
అంటే మన కరెన్సీలో లక్ష రూపాయలకు చేరుకుంది. సాయంత్రం 5.30 గంటలకు 24 క్యారెట్ల పసిడి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2 వేలు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటిదాక బంగారం ధర దాదాపు రూ.20 వేలకు పైగానే ఉంది. డిసెంబర్ 31న దాదాపు రూ. 79 వేలు ఉన్న బంగారం ధర.. గత 3 నెలల్లోనే 26 శాతం పెరిగింది. వెండి ధర కూడా కిలో ధర రూ. లక్షకు చేరువవుతోంది.
Also Read: పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఇదే.. నైట్‌పబ్ బౌన్సర్ నుంచి పోప్‌గా!!
గతంలో ఓసారి లక్ష మార్కును దాటిన కిలో వెండి ధర.. ప్రస్తుతం రూ.99,299గా ఉంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో కూడా 10 గ్రాముల బంగారం ధర మొదటిసారి రూ.96 వేల మార్కు దాటింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్స్‌లో 10 గ్రాముల బంగారం ఒక్కరోజులోనే ఏకంగా రూ.1621 పెరిగింది. ఇంట్రాడేలో రూ.96,875 వద్ద గరిష్ఠానికి చేరుకుంది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్‌లో పరిస్థితులు సద్దుమణిగేవరకు ఇలాంటి పరిస్థితే కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థుల పాడుపని.. మత్తు కోసం ఇంక్షన్లు, ట్యాబ్లెట్లు - ఒకరు మృతి
Also Read: పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఇదే.. నైట్‌పబ్ బౌన్సర్ నుంచి పోప్‌గా!!
telugu-news | rtv-news | gold-rates-today | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu | business news telugu