/rtv/media/media_files/2025/11/14/andrew-strauss-getting-second-marriage-2025-11-14-20-40-54.jpg)
andrew strauss getting second marriage
మాజీ క్రికెట్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మొదటి భార్య 2018లో మరణించడంతో.. ఇప్పుడు తనకంటే 18 సంవత్సరాలు చిన్నదైన తన స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నాడు. రెండేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి మొదటిసారి కెమెరాలకు చిక్కారు. ఇప్పుడు తన మొదటి భార్య చనిపోయిన ఏడు సంవత్సరాల తర్వాత.. ఆ దిగ్గజ క్రికెటర్ మళ్ళీ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అతడు మరెవరో కాదు.. ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్.
andrew strauss second marriage
ఇంగ్లాండ్ మాజీ లెజెండ్ ఆండ్రూ స్ట్రాస్ రెండో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అతను తన కంటే 18 సంవత్సరాలు చిన్నదైన ఆంటోనియా లిన్నెయస్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. కాగా స్ట్రాస్ గతంలో రూత్ మెక్‌డొనాల్డ్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో 2018లో మరణించింది. అందువల్ల స్ట్రాస్ తన మొదటి భార్య మరణించిన ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
England cricket icon Andrew Strauss, 48, set to marry PR exec fiancée 18 years his junior in South Africa - seven years after wife Ruth died of rare lung cancer https://t.co/VFVYOyP6zY
— Daily Mail (@DailyMail) November 14, 2025
ప్రస్తుతం ఆండ్రూ స్ట్రాస్ వయసు 48 సంవత్సరాలు కాగా అతనికి కాబోయే భార్య ఆంటోనియా లిన్నెయస్ వయసు 30 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 18 ఏళ్లు. ఇదిలా ఉంటే స్ట్రాస్, లిన్నెయస్ జంటగా రెండేళ్ల క్రితం ఒక లండన్ రెస్టారెంట్ నుండి బయలుదేరి మొదటిసారి కెమెరాకు చిక్కారు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ అప్పటి నుంచి రూమర్స్ వెలువడ్డాయి.
అక్కడితో ఆగకుండా వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లోని రాయల్ బాక్స్‌లో కూడా ఈ జంట కలిసి కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఆ రూమర్స్‌ను నిజం చేస్తూ త్వరలో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు.
ఆండ్రూ అద్భుతమైన కెరీర్
ఆండ్రూ స్ట్రాస్ చాలా సంవత్సరాలుగా ఇంగ్లాండ్ తరఫున కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ తరఫున 100 టెస్ట్ మ్యాచ్‌ల్లో 7037 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 127 వన్డేల్లో 4205 పరుగులు చేశాడు. వాటిలో 6 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నాలుగు టీ20ల్లో 73 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అతని మొత్తం పరుగులు 11315కు చేరుకున్నాయి. అతను చివరిసారిగా 2012లో ఆడాడు.
Follow Us