/rtv/media/media_files/2025/07/27/father-assaulted-9-year-old-daughter-in-narayanapet-district-2025-07-27-10-54-25.jpg)
Father Assaulted 9 Year Old Daughter In Narayanapet District
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పూసలాపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. భార్య, కూతురితో కలిసి ఉంటున్నాడు. అతడి కూతురికి 9 ఏళ్లు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతోంది. అయితే శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఈ విషయం తల్లికి చెప్పింది.
Also Read: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
Also Read : వీర్యం డొనేట్ చేసి అంత సంపాదించొచ్చా !
Father Assaulted 9 Year Old Daughter
శనివారం ఉదయం ఆ బాలికను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలు ఆ బాలికను అడిగిన తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఢిల్లీ అక్రమ మతమార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
Also Read : ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
rape | rtv-news | telugu-news | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu