/rtv/media/media_files/2025/07/27/agra-conversion-gang-2025-07-27-09-32-39.jpg)
Agra Conversion Gang Has Pak Links, Used Online Games To Target People, Top Cop
ఇటీవల ఢిల్లీలో అక్రమ మతమార్పిడి చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఏడు రాష్ట్రాల నుంచి డజన్ల కొద్దీ బాలికలు, యువతులను ట్రాప్ చేసి మతమార్పిడి చేయించిన ఘటన సంచలనం రేపింది. 33, 18 ఏళ్ల వయసున్న అక్కా చెల్లెలు ఇటీవల ఆగ్రా నుంచి తప్పిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వాళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించిన ఈ అక్రమ మతమార్పిడి రాకెడ్ వ్యవహారం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు14 మందిని నిందితులను అరెస్టు చేశారు.
Also Read: చీరకట్టుకొని స్లీవ్‌లెస్‌లో సిగ్గులేని చిందులు..పోలీసుల ముందే బరితెగింపు
అయితే తాజాగా ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ మత మార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తేలింది. వారే యువతను ఇస్లాంను స్వీకరించేలా ప్రభావితం చేసేందుకు సాయం చేశారని పోలీసులు దర్యాప్తులో బయటపడింది. ఢిల్లీకి చెందిన అబ్దుల్ రెహ్మన్, గోవాకు చెందిన అయేషా ఈ అక్రమ మత మార్పిడి రాకెడ్‌ను నడిపిస్తున్నట్లు తేల్చారు. ఈ గ్యాంగ్ ఉత్తరాఖాండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి యువతులను ట్రాప్ చేసి మతం మార్పించినట్లు పేర్కొన్నారు.
Also Read: మరో బోయింగ్ విమానంలో చెలరేగిన మంటలు.. బయటికి దూకిన ప్రయాణికులు
యువతులను లూడో లాంటి ఆన్‌లైన్ గేమ్స్‌లో టార్గెట్ చేసి కూడా ఈ దారుణాలకు పాల్పడ్డట్లు తెలిపారు. ఆ యువతులను వాట్సాప్‌గ్రూప్‌లలో యాడ్ చేసి అక్కడ వాళ్లకి బ్రెయిన్ వాష్ చేసేవారని.. ఇస్లాం గొప్పతనం గురించి చెప్పి, హిందూ మతంలో ఉండే తప్పులు చెప్పి ప్రభావితం చేసేవారని చెప్పారు. ఇప్పటిదాకా డజన్ల కొద్ది బాలికలను మాతం మార్పించారని పేర్కొన్నారు. అంతేకాదు ఈ మతమార్పిడి కోసం వివిధ ప్రాంతాల నుంచి ఈ ముఠాకు నిధులు కూడా వస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ ముఠా వెనుక పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తాజాగా దర్యాప్తులో తేలడం చర్చనీయాంశమవుతోంది.