/rtv/media/media_files/2025/08/17/pm-modi-inaugurates-2025-08-17-14-28-23.jpg)
PM Modi inaugurates
Delhi Highway Projects: దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్(Delhi Traffic) సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, రూ.11,000 కోట్లతో నిర్మించిన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi Inaugurates) ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీలో అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టులలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) ప్రాజెక్టులు ఉన్నాయి.
Also Read: సుంకాలపై రాని క్లారిటీ..అమెరికా ప్రతినిధి బృందం భారత్ పర్యటన వాయిదా
Prime Minister @narendramodi unveils two major National Highway projects, the Delhi section of Dwarka Expressway and Urban Extension Road-II (UER-II)
— PIB India (@PIB_India) August 17, 2025
Watch: ⬇️ pic.twitter.com/sVDg1m2XEh
ఈ రెండు నేషనల్ హైవేలు ఢిల్లీ, గురుగ్రామ్ మరియు ఎన్‌సీఆర్‌లోని ఇతర ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందిస్తాయి. ఇక పై తక్కువ సమయంలోనే ప్రయాణించవచ్చు. ఈ రోడ్ల ప్రారంభంతో ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలైన ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్ వంటి చోట్ల ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే
దేశంలోనే మొదటి 8-లేన్ల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిలిచే ఈ ప్రాజెక్టు, ఢిల్లీ, -గురుగ్రామ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. దీని 10.1 కిలోమీటర్ల ఢిల్లీ విభాగాన్ని రూ. 5,360 కోట్లతో నిర్మించారు. ఈ మార్గం యశోభూమి, ఢిల్లీ మెట్రో బ్లూ, ఆరెంజ్ లైన్లకు, రాబోయే బిజ్వాసన్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానం అవుతుంది. గత సంవత్సరం మార్చిలో, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని 19 కిలోమీటర్ల హర్యానా విభాగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఇప్పుడు ఢిల్లీ సెక్షన్ కూడా అందుబాటులోకి రావడంతో గురుగ్రామ్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.
అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II)
సుమారు రూ. 5,580 కోట్ల వ్యయంతో నిర్మించిన UER-II ప్రాజెక్టు ఢిల్లీకి మూడవ రింగ్ రోడ్‌గా పనిచేస్తుంది. ఇది ఢిల్లీ, సోనిపట్, బహదూర్‌గఢ్ వంటి నగరాలను కలుపుతుంది. ఈ రహదారి అలీపూర్ నుంచి డిచాన్ కలాన్ వరకు నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడింది. దీని నిర్మాణానికి ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ నుండి సేకరించిన రెండు మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉపయోగించారు, దీంతో ల్యాండ్‌ఫిల్ ఎత్తు ఏడు మీటర్లు తగ్గింది. ఈ రెండు ప్రాజెక్టులు ఢిల్లీ ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, నగరం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి.