Richest Ganpati: ఖరీదైన వినాయకుడు...గణపయ్యకు రూ.474 కోట్ల ఇన్సూరెన్స్
ముంబయిలోని 'మతుంగా ప్రాంతంలో జీఎస్బీ సేవా మండల్' గణేశ్ మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరు గత ఏడు దశాబ్దాలుగా వినాయక వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈసారి రూ. 474.46 కోట్ల బీమా చేయించామని వెల్లడించారు.