Dead Body In Drum : బ్లూడ్రమ్‌లో భర్త డెడ్ బాడీ.. భార్యాపిల్లలు మిస్సింగ్..

మరో సారి బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. డ్రమ్ములో కుళ్లిన స్థితిలో పురుషుడి శవం బయట పడింది. రాజస్థాన్ అల్వార్ ఆదర్శనగర్ లోని ఓ ఇంటి డాబాపై డ్రమ్ములో ఈ శవం బయటపడింది. మృతుడిని యూపీకి చెందిన హన్స్ రాజ్ గా గుర్తించారు. మృతుని భార్యాపిల్లలు కూడా మిస్సయ్యారు.

New Update
Husband's dead body in Blue Drum

Husband's dead body in Blue Drum

మరో సారి బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. బ్లూ డ్రమ్ములో కుళ్లిన స్థితిలో పురుషుడి శవం(Dead Body In Drum) బయట పడింది. రాజస్థాన్ లోని అల్వార్ ఆదర్శనగర్ లోని ఓ ఇంటి డాబాపై డ్రమ్ములో ఈ శవం బయటపడింది. కుళ్లిపోయి ఉన్న స్థితిలో ఉన్న డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడిని యూపీకి చెందిన హన్స్ రాజ్ గా గుర్తించారు. అయితే, అతడి భార్యాపిల్లలు కనిపించక పోవడం(Wife And Children Missing) సంచలనంగా మారింది.

Also Read:Manchu Manoj: కలిసిపోయిన మంచు విష్ణు, మనోజ్.. కొడుకుకి అవార్డు వేళ  'అన్నా' అంటూ పోస్ట్ !

గతంలో మీరట్‌లో భర్తను చంపి డ్రమ్ములో పెట్టిన ఘటన యావత్ దేశాన్ని నివ్వెరపోయేట్టు చేసింది. అంతేకాదు బ్లూ డ్రమ్ము అంటేనే భర్తల్ని, మగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ముస్కాన్ అనే వివాహిత.. తన ప్రియుడితో కలిసి నేవీ అధికారి అయిన తన భర్త సౌరభ్ రాజ్ పూత్ ను చంపి కాళ్లు చేతులు ముక్కలుగా నరికి ఒక బ్లూకలర్ డ్రమ్ తీసుకొచ్చి దానిలో శరీర భాగాలు వేసి, దాని మీద ఇసుక వేసిన ఘటన తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రియుడితో ముస్కాన్  జంపయింది. ఆ తర్వాత దుర్వాసన రావడంతో  ఈ  ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్కాన్ ఘటన యావత్ దేశంలో మగాళ్లను అసలు పెళ్లంటేనే.. వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. అప్పటి నుంచి చాలా మంది బ్లూకలర్ డ్రమ్ చూస్తే భయంతో వణికిపోతున్నారు. ఈక్రమంలో తాజాగా..రాజస్థాన్  లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh) కు చెందిన హన్సరాజ్ అనే  వ్యక్తి ఉపాధి నిమిత్తం భార్య, పిల్లలతో కలిసి రాజస్థాన్‌కు వచ్చి సెటిల్ అయ్యాడు. తిజారా జిల్లా అల్వార్‌లోని ఆదర్శ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. హన్సరాజ్ స్థానికంగా ఉండే ఓ ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. అతడు తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.

ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి హన్సరాజ్ కుటుంబం కనిపించకపోగా వారి ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావటాన్ని పొరిగింటి వారు గుర్తించారు. రోజు రోజుకు దుర్వాసన మరింత పెరుగుతూ ఉండటంతో  పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి దగ్గర సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బ్లూ డ్రమ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. ఆ డ్రమ్ము తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ డ్రమ్ములో హన్సరాజ్ శవం బయటపడింది. హన్సరాజ్  చనిపోయి చాలా రోజులు కావటంతో శవం బాగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  

కాగా  సంఘటన జరిగిన తర్వాత నుంచి భార్య, వారి ముగ్గురు పిల్లలు కనిపించటం లేదు. హన్స్ రాజ్ హత్యకు గురయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు అతని భార్య, పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడ్ని ఎవరైన చంపారా..?.. లేదా భార్యభర్తల మధ్య ఏమైన తగాదాల వల్ల ఇది జరిగిందా?.. లేకుంటే ఏదైన వివాహేతర సంబంధం ఉందా..?.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.  ఈ ఘటనతో మరోసారి డ్రమ్ మర్డర్ ఘటన సంచలనంగా మారింది.

ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!

Advertisment
తాజా కథనాలు