/rtv/media/media_files/2025/05/20/wMztCzxXvTMYEDUxw63t.jpg)
Babbar Khalsa
Babbar Khalsa : పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ఉగ్రవాద గ్రూపుల ఆనవాళ్లు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశానికే ద్రోహం తలపెట్టిన పలువురు గూఢచర్యులను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తున్నాయి. పాకిస్థాన్ ఇచ్చే డబ్బులకు ఆశపడి చాలామంది వారికి గూఢచర్యం చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఐఎస్‌ఐతో పాటు ఖలీస్థాన్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్న జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అయితే వీరిని పట్టుకునే క్రమంలో వారు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముఠాలోని ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
Also Read : రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థతో సంబంధం ఉన్న ఒక మాడ్యుల్(ముఠా) రెండు రోజుల క్రితం పంజాబ్‌లోని బటాలాలో గ్రెనేడ్ దాడికి పాల్పడింది. ఈ సంస్థకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ సంస్థ మద్దుతు ఉంది. వారి మద్దతుతో తరుచుగా ఉగ్ర కార్యకలాపలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బీకేఐ కి చెందిన ముఠా నేత మన్నూ అగ్వాన్ ఆదేశాల మేరకు బటాలాలోని ఒక మద్యం షాపు వద్ద వీరు గ్రెనేట్ విసిరారు. అయితే వారిని పట్టుకునేందుకు రెండు రోజులుగా పోలీసులు గాలింపు చేపట్టారు.
Also Read : 12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్
ఈ క్రమంలోనే ఒక రహాస్య ప్రదేశంలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిని తీసుకెళ్తుండగా పోలీసులతో పెనుగులాట జరిగింది. వారి వద్ద ఉన్న ఆయుధాలతో పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ప్రతీగా పోలీసులు కాల్పులు జరపడంతో ముఠా సభ్యుడు జతిన్ కుమార్ కు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా నిందితుల నుంచి 30 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: SRH VS LSG: తాను పోయింది...లక్నోను తీసుకెళ్ళిపోయింది
Also Read : తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు