యంగ్ హీరో జూనియర్ నందమూరి తారక రామారావు తన నటన, డ్యాన్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెచ్చేలా నిలిచారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయలు మీకోసం.
Also Read : రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!
Jr.NTR 42nd Birthday Special Story
జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా 1983లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు. ఆ తర్వాత బాల రామాయణంలో నటించారు. ఇక హీరోగా 2001లో నిన్ను చూడాలని మూవీతో డెబ్యూగా మారాడు. ఆ తర్వాత వరుసగా స్టూడెంట్ నెం1, సింహ్రాది వంటి సినిమాలతో హిట్ కొట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
Also Read : జరిమానా వేసినా బుద్ధి మారలే.. దిగ్వేశ్‌తో గొడవపై అభిషేక్ షాకింగ్ కామెంట్స్!
ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ భారీ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌కు చెప్పుకోదగ్గ హిట్‌లు అయితే పడలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విజయాల కోసం ఎన్నో ఏళ్లు వేచి చూశాడు. ఎన్టీఆర్‌కు మళ్లీ టెంపర్ మూవీతో హిట్ పడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేతా వీర రాఘవ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు.
Also Read : 12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యాన్స్ వేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వార్ 2 మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి నేడు టీజర్ వచ్చే అవకాశం ఉంది.
Also Read : సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!
/rtv/media/media_files/2025/05/20/Qa7nbrnFvS1sR26JuGup.jpg)
birthday | 42-birthday