/rtv/media/media_files/2025/05/20/Ww3rQkMkfag9xL4ZpHCb.jpg)
Beating Retreat At Wagha Boarder
భారత్, పాక్ బోర్డర్ అయిన వాఘా-అట్టారీ బోర్డర్దగ్గర ప్రతీ రోజూ బీటింగ్ రిట్రీట్ జరుగుతుంది. రెండు దేశాల సైనికులు వందనం చేసుకుని , స్నేహ హస్తాన్ని అందుకుంటాయి. కానీ ఏప్రిల్ లో పహల్గాం దాడి జరిగిన తర్వాత భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టింది. దీనిక ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా దాడులను చేసింది. ఈ నేపథ్యంలో మే 8న భారత్, పాక్ అన్ని బోర్డర్లను మూసేశారు. అలాగే సరిహద్దుల్లో జరిగే బీటింగ్ రిట్రీట్ ను కూడా ఆపేశారు.
Also Read : సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!
Also Read : ఆర్మూరులో మరో గురుమూర్తి.. కన్నబిడ్డల ముందే భార్య గొంతుకోసి..!
గేట్లు తెరవరు..ప్రజలను అనుమతించరు..
అయితే ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గాయి. పరిస్థితులు చక్కబడ్డాయి. అందుకే బీటింగ్ రిట్రీట్ ప్రక్రియను మళ్ళీ ప్రారంభిస్తున్నారు. ఈ రోజు వాఘా-అట్టారీ బోర్డర్ లో ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభం అవుతోంది. అయితే ఇందులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోయింది...ఉద్రిక్తతలు తగ్గాయి. కానీ భారత్, పాకిస్తాన్ ల మధ్య స్నేహ వాతావరణం మాత్రం తిరిగి రాలేదు. అందుకే బీటింగ్ రిట్రీట్ ప్రక్రియ జరిగినా రెండు ప్రక్రియలు మాత్రం జరగవని చెబుతున్నారు. బోర్డర్ లో రెండు జాతీయ పతాకాల అవనతం చేస్తారు కానీ...దీనికి ప్రజలను మాత్రం ఇంకా అనుమతించడం లేదు. అలాగే బిఎస్ఎఫ్ దళాలు పాకిస్తాన్ రేంజర్లతో కరచాలనం చేయవు. మామూలుగా జెండాలను ఎగురేసినప్పుడు బోర్డర్ దగ్గర రెండు దేశాల గేట్లనూ తెరుస్తారు. కానీ ఇప్పుడు వాటిని తెరవకుండానే జాతీయ జెండాలను ఎగుర వేస్తారు. అయితే ఎప్పటిలాగే ఇక మీదట కూడా ప్రతీరోజూ సాయంత్రం పాకిస్తాన్ వాఘా ఎదురుగా, గండా సింగ్ వాలా మీదుగా ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనివాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద బీటింగ్ రిట్రీట్ ను మాత్రం జరుపుతామని భారత ఆర్మీ తెలిపింది.
today-latest-news-in-telugu | india | pakistan | attari border beating retreat ceremony
Also Read: Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం..ట్రంప్
Also Read : విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే