4 AM Biryani : 4 AM బిర్యానీ తింటున్నారా? అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే...

ఈ మధ్యకాలంలో 4 AM బిర్యానీ ట్రెండ్‌ జోరుగా నడుస్తోంది. అంటే తెల్లవారుజామునే బిర్యానీ తినడం. ఈ కొత్త ట్రెండ్‌ బాగున్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం రిస్క్‌ తప్పదని చెబుతున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో బిర్యానీ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.

New Update
FotoJet (20)

4 AM Biryani Side Effects

ఈ మధ్యకాలంలో 4 AM బిర్యానీ ట్రెండ్‌ జోరుగా నడుస్తోంది. అంటే తెల్లవారుజామునే బిర్యానీ(chicken-biryani) తినడం దీని ఉద్దేశం. ఈ కొత్త ట్రెండ్‌ రుచికి బాగున్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం రిస్క్‌ తప్పదని చెబుతున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో బిర్యానీ లాంటి ఫుడ్‌ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. తెల్లవారుజామునే బిర్యానీ ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటి? ఒకసారి తెలుసుకుందాం.

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ మధ్య కాలంలో అర్థరాత్రి లేదా తెల్లవారుజామున బిర్యానీ(chicken dum biryani) తినే ట్రెండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా రంజాన్ మాసంలో హైదరాబాద్‌లో తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీని భోజన ప్రియులు తెగ లాగించేస్తూ ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో రంజాన్‌ తో సంబంధం లేకుండా 4 AM Biryani ట్రెండ్‌ బాగా నడుస్తోంది. అర్థరాతి లేదా తెల్లవారజామున అల్పాహారం తినడం పెద్ద ప్రమాదం కాకపోవచ్చు కానీ,  బిరియానీ లాంటి ఫుడ్ ఐటెమ్స్(biryani-leaves) కారణంగా మన శరీరంలో చాలా మార్పు(side-effects)లే వచ్చే అవకాశం ఉంది. పగటిపూట ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి మంచి ప్రయత్నాలు చేసినప్పటికీ.. అర్థరాత్రి సమయంలో ఇలా ఏది పడితే అది తినడం మాత్రం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Also Read :  ముగిసిన కేసీఆర్‌ సిట్‌ విచారణ..

4 AM Biryani Side Effects

రాత్రిపూట ఆలస్యంగా తినడం, చాలా తక్కువ సమయం నిద్రపోవడం.. అనేది జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. అర్ధరాత్రి పూట భోజనం చేయడం వల్ల శరీరంలోని సహజమైన జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది, ఇది జీవక్రియ బలహీనంగా మారడానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా బరువు పెరగడానికి దారితీస్తుంది అని వైద్య నిపుణులు అంటున్నారు.

అర్థరాత్రి, తెల్లవారుజామున ఆహారం తినడం తరచుగా ఆలస్యంగా నిద్రపోవడానికి కారణమవుతుంది. మీరు సహజంగా ఏ సమయానికి నిద్రపోతారో.. ఆ సమయంలో నిద్రపోలేరు. స్లీప్ సైకిల్ కి అంతరాయం కలిగిస్తుంది. సరిగా నిద్రలేకపోవడం, ఓ టైమ్ కు నిద్రపోక పోవడం వంటివి నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలకు కారణం అవుతాయి.  అర్థరాత్రి తర్వాత జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కడుపులో యాసిడిటీ తదితర జీర్ణ సమస్యలు వస్తాయి. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి, గ్యాస్ట్రిక్ అసౌకర్యాన్ని నివారించడానికి సాయంత్రం తేలికపాటి భోజనాన్ని ఎంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.  

శరీర జీవక్రియ రాత్రిపూట మందగిస్తుంది, ఇది కేలరీలను బర్న్ చేయడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడం వల్ల అధిక కేలరీలు కొవ్వుగా నిల్వ చేయబడటం వలన బరువు పెరగడానికి దారితీస్తుంది. చెదిరిన నిద్ర, సక్రమంగా తినే విధానాలు మానసిక రుగ్మతలను తీవ్రతరం చేస్తాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతాయి. మానసిక స్థితిని స్థిరీకరించడానికి, మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి స్థిరమైన ఆహారపు షెడ్యూల్‌ను ఉంచుకోవడం చాలా కీలకం అని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యంగా తినడం, ఆలస్యంగా నిద్రపోవడం రక్తపోటును పెంచుతుంది. మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అర్ధరాత్రి ఆహారపు అలవాట్లు హృదయనాళాల్లో సమస్యలకు కారణం అవుతాయి.అని అధికారులు చెబుతున్నారు.

Also Read :  కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రేవంత్ సర్కార్‌ భారీ సాయం..

Advertisment
తాజా కథనాలు